యాదాద్రి టెంపుల్ వద్ద ఉద్రిక్తత: బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ను అడ్డుకున్న పోలీసులు, లాఠీఛార్జ్

By Nagaraju penumalaFirst Published Sep 7, 2019, 5:19 PM IST
Highlights

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ నేతలు రాయగిరి నుంచి యాదాద్రికి ర్యాలీకి తరలివచ్చారు. కొండపైకి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. 
 

యాదాద్రి: పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శిల్పాల వివాదం రాజుకుంటోంది. దేవాయలంలోని స్తూపాలపై తెలంగాణ సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు సింబల్ ఉండటంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ నేతలు రాయగిరి నుంచి యాదాద్రికి ర్యాలీకి తరలివచ్చారు. కొండపైకి వెళ్లేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. 

లక్ష్మణ్ తోపాటు కొందరిని మాత్రమే కొండపైకి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అందరినీ కొండపైకి పంపించాలంటూ బీజేపీ నేతలు పట్టుబట్టారు. దాంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసి బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టారు. 

అనంతరం కొందరు బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో యాదాద్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మరికొంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు భారీగా మోహరించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

యాదాద్రి వివాదం: కేసీఆర్ కృష్ణదేవరాయలా, మోనార్కా?

కేసీఆర్ చిత్రాలు: యాదాద్రిలో రాజాసింగ్ హల్ చల్, ప్రభుత్వానికి అల్టిమేటమ్

యాదాద్రిపై కేసీఆర్ సారు శిల్పాలు (ఫొటోలు)

ఆయనకు దేవుడు, యాదాద్రిపై అందుకే కేసీఆర్ బొమ్మ చెక్కాడు: కిషన్ రావు

యాదాద్రి శిల్పాలపై అధికారుల వివరణ: భావి తరాల కోసమే కేసీఆర్, కారు చిత్రాలు, రాజకీయ ఉద్దేశం లేదు

యాదాద్రి శిల్పాలపై కేసీఆర్ బొమ్మలు

click me!