ప్రగతి భవన్ వద్ద పద్మా దేవేందర్ రెడ్డికి షాక్: నరసింహన్ వీడ్కోలుకు ఈటల హాజరు

Published : Sep 07, 2019, 12:24 PM IST
ప్రగతి భవన్ వద్ద పద్మా దేవేందర్ రెడ్డికి షాక్: నరసింహన్ వీడ్కోలుకు ఈటల హాజరు

సారాంశం

గతంలో తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డికి నరసింహన్ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం దక్కలేదు. కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ వద్ద ఆమెకు చుక్కెదురైంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసం వద్ద శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి షాక్ తగిలింది. గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి ఆమెను అనుమతించలేదు. ప్రగతి భవన్ లో నరసింహన్ కు వీడ్కోలు సన్మానం ఏర్పాటు చేశారు. 

నరసింహన్ వీడ్కోలు సన్మానానికి హాజరు కావడానికి వచ్చిన పద్మా దేవేందర్ రెడ్డిని లోనికి అనుమతించలేదు. మంత్రులు, ఐపిఎస్ అదికారులు, ఐఎఎస్ అధికారులకు మాత్రమే అనుమతి ఉందని, మిగతావారికి అనుమతి లేదని సంబంధిత అధికారులు పద్మా దేవేందర్ రెడ్డికి చెప్పారు. దాంతో ఆమె వెనుదిరిగి ఇంటికి వెళ్లిపోయారు. 

కాగా, టీఆర్ఎస్ లో తన వ్యాఖ్యల ద్వారా కలకలం రేపిన మంత్రి ఈటల రాజేందర్ నరసింహన్ వీడ్కోలు సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణ నూతన గవర్నర్ గా తమిళసై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. నరసింహన్ స్థానంలో ఆమె గవర్నర్ గా నియమితులయ్యారు. 

సుదీర్ఘ కాలం గవర్నర్ గా పనిచేసిన నరసింహన్ గౌరవార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతిభవన్ లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్