కొత్తగూడెంలో మైనర్లతో వ్యభిచారం.. 15మందిని రక్షించిన పోలీసులు..

By SumaBala BukkaFirst Published Jan 30, 2023, 12:28 PM IST
Highlights

మైనర్లతో బలవంతంగా వ్యభిచారం చేపిస్తున్న నిర్వాహకులను కొత్తగూడెం పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహాల మీద జరిపిన దాడిలో 15మంది మైనర్ అమ్మాయిలు దొరికినట్టు సమాచారం. 

కొత్తగూడెం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్న గృహాలపై పోలీసులు దాడులు చేశారు. సోమవారం పోలీసులు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల  పరిధిలో వ్యభిచార గృహాలపై మూకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వివిధ వ్యభిచార గృహాల్లో 15 మంది మైనర్ బాలికలను గుర్తించారు. మైనర్ బాలికలను టార్గెట్ చేసి వారితో వ్యభిచారం నిర్వహిస్తూ.. వ్యభిచార కూపంలోకి మైనర్ బాలికలను లాగుతున్న పలువురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తర్వాత అరెస్టు చేసిన నిర్వాహకులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్కు తరలించారు. వీరంతా  మైనర్ బాలికలు, యువతులతో ప్రత్యేకంగా వ్యభిచార గృహాలు ఏర్పాటు చేసి.. వారిని వ్యభిచార రూపిలోకి దింపుతున్న వారే. ప్రస్తుతం దాడులు చేసిన వ్యభిచార గృహాలతో పాటు.. ఇంకా ఎక్కడెక్కడ  వ్యభిచార కేంద్రాలు ఉన్నాయన్న విషయాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు.  సోమవారం మధ్యాహ్నం ఈ దాడులకు సంబంధించిన విషయాలను పోలీసు అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. 

రాజ్యాంగ పదవిలో ఉన్నవారు బాధ్యతగా వ్యవహరించాలి.. గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉండగా, జనవరి 18న మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. మహిళలను బలవంతంగా వ్యభిచార వ్యాపారంలోకి దింపిన 39 ఏళ్ల మహిళకు మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు నిన్న జారీ చేసిన ఉత్తర్వులో, ప్రత్యేక న్యాయమూర్తి వివి విర్కర్ మహిళల అక్రమ రవాణ (నివారణ) చట్టంలోని నిబంధనల ప్రకారం నిందితురాలిని దోషిగా ప్రకటిస్తూ, ఆమెకు రూ. 2,000 జరిమానా విధించారు.

థానే జిల్లాలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లోని తుర్భే ప్రాంతంలో ఆ మహిళ నివాసం ఉంటోంది. నిందితురాలు తుర్భేలోని తన నివాసాన్ని వ్యభిచారం కోసం ఉపయోగించుకుందని.. మహిళలు, మైనర్ బాలికలను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి నెట్టిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేఖా హివ్రాలే కోర్టుకు తెలిపారు.

మే 30, 2018న, నవీ ముంబై పోలీసుల యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ బృందం ఆ ప్రాంగణంలో దాడి చేసింది. ఈ దాడిలో ఒక మహిళ బలవంతంగా ఫ్లెష్ ట్రేడ్ నిర్వహించడం వెలుగు చూసింది. ఆమె దగ్గర ఇరుక్కున్న మహిళలను రక్షించి నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలిపై అభియోగాలను రుజువు చేసేందుకు 12 మంది ప్రాసిక్యూషన్ సాక్షులను విచారించామని హివ్రాలే తెలిపారు. 

నిందితులపై అభియోగాలను ప్రాసిక్యూషన్ విజయవంతంగా రుజువు చేసిందని, దోషులుగా నిర్ధారించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మరో మహిళను బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా వర్ణించారు. ఆమెను కోర్టు అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా ప్రకటించింది.

click me!