ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: కోనేరు కృష్ణ సహా మరో 16 మంది అరెస్ట్

By narsimha lodeFirst Published Jun 30, 2019, 5:08 PM IST
Highlights

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి కేసులో కొమరం బీమ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్  కోనేరు కృష్ణతో పాటు మరో 16 మందిని పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు.
 

కాగజ్‌నగర్:ఎఫ్ఆర్ఓ అనితపై దాడి కేసులో కొమరం బీమ్ జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్  కోనేరు కృష్ణతో పాటు మరో 16 మందిని పోలీసులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు

ఇవాళ ఉదయం కాగజ్‌నగర్‌ మండలం సార్సాలో  మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కోనేరు కృష్ణ సహా ఆయన అనుచరులు దాడికి దిగారు. ఈ ఘటనలో  తీవ్రంగా గాయపడిన అనిత ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మరో వైపు ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదుపై పోలీసులు కోనేరు కృష్ణ సహా 16 మందిని అరెస్ట్ చేశారు. ఎఫ్ఆర్ఓ అనితపై దాడి చేసిన కృష్ణ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని  ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందన ఇదీ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: కోనేరు కృష్ణపై కేసు

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి ఎఫెక్ట్: జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ పదవికి కృష్ణ రాజీనామా

నేను దాడి చేయలేదు, వాళ్లే దాడి చేశారు: జిల్లా పరిషత్ వైస్ ఛైర్మెన్ కృష్ణ

ఎఫ్ఆర్ఓ అనితపై దాడి: నిందితులపై చర్యలు తీసుకోవాలన్న హరీష్ (వీడియో)

మహిళా ఫారెస్ట్ అధికారిని చితకబాదిన జడ్పీ వైఎస్ ఛైర్మన్ (వీడియో)

click me!