గెట్ టూ గెదర్ పార్టీ కోసమే పబ్ బుక్ చేశారు: అమ్నేషియా పబ్ మేనేజర్ సాయి

By narsimha lode  |  First Published Jun 3, 2022, 4:28 PM IST


గెట్ టూ గెదర్ కోసం పబ్ ను  బుక్ చేశారని అమ్నేషియా పబ్ మేనేజర్ సాయి చెప్పారు. ఈ పబ్ లో లిక్కర్ లేదని  చెప్పారు. పబ్ సీసీటీవీ పుటేజీని కూడా పోలీసులు సీజ్ చేశారు.


హైదరాబాద్: పరీక్షలు పూర్తైనందున విద్యార్ధులంతా గెట్ టూ గెదర్ పార్టీని పబ్ లో చేసుకున్నారని Amnesia పబ్ మేనేజర్ సాయి చెప్పారు.

గత నెల 28వ తేదీన విద్యార్థులంతాటెట్ టూ గెదర్ కోసం పబ్ ను బుక్ చేసుకొన్నారని సాయి తెలిపారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి ఈ విషయాన్ని వెల్లడించారు.  మధ్యాహ్నం  రెండు గంటల సమయంలో వచ్చిన విద్యార్ధులు సాయంత్రం 5 గంటలకు వెళ్లిపోయారని Sai చెప్పారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తాము లిక్కర్ ను ఓపెన్ చేయలేదని  సాయి వివరించారు. కాలేజీ విద్యార్ధులు గెట్ టూ గెదర్ కావడంతో మేజర్లు, minor పబ్ కు వచ్చారన్నారు. ఈ పార్టీకి Liquorను అనుమతివ్వలేదని సాయి స్పష్టం చేశారు. సాయంత్రం పబ్ నుండి వెళ్లే సమయంలో పబ్ మెయిన్ గేట్ వద్ద కొద్దిసేపు మైనర్ బాలిక ఉందన్నారు. అయితే ఆమె మెడపై చేయి వేసి కొందరు తీసుకెళ్తన్నట్టుగా తాము చూశామన్నారు. పబ్ లో ఎలాంటి చిన్న ఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. నిబంధనల ప్రకారంగానే తాము వ్యవహరించామని సాయి ఆ ఇంటర్వూలో చెప్పారు.

Latest Videos

పబ్ లోని CCTV పుటేజీని కూడా పోలీసులకు అప్పగించామన్నారు. Get Togetherపార్టీకి బాధిత బాలిక నవ్వుకుంటూ స్నేహితులతో కలిసి వచ్చిందన్నారు. బయటకు వెళ్లే సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లిందన్నారు. పోలీసులు వచ్చి చెబితేనే బాలికపై దురాగతం జరిగిన విషయం తమకు తెలిసిందని సాయి చెప్పారు.ఈషాన్ గాంధీ అనే ఆర్గనైజర్ పబ్ ను బుక్ చేశారని  సాయి వివరించారు.
 

click me!