కేసీఆర్ పతనం గజ్వెల్ నుంచే మొదలు: నర్సారెడ్డి

By pratap reddyFirst Published Oct 27, 2018, 12:19 PM IST
Highlights

నర్సారెడ్డితో పాటు రాములు నాయక్ కూడా కాంగ్రెసు పార్టీలో చేరారు. వారి చేరికను స్వాగతిస్తున్నట్లు కుంతియా చెప్పారు. కేసిఆర్ ను ఓడించడమే కాంగ్రెసు లక్ష్యమని అన్నారు.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పతనం గజ్వెల్ నుంచే ప్రారంభమవుతుందని రాహుల్ గాంధీ సమక్షంలో శనివారం కాంగ్రెసులో చేరిన నర్సారెడ్డి అన్నారు. ప్రజల్లో ఉండాలనుకునేవారు టీఆర్ఎస్ లో ఉండలేరని ఆయన అన్నారు. 

నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో పేదలకు న్యాయం జరగలేదని అన్నారు. కాంగ్రెసులో చేరడంతో సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని ఆయన అన్నారు. కేసిఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ వచ్చిందని అన్నారు. 

నర్సారెడ్డితో పాటు రాములు నాయక్ కూడా కాంగ్రెసు పార్టీలో చేరారు. వారి చేరికను స్వాగతిస్తున్నట్లు కుంతియా చెప్పారు. కేసిఆర్ ను ఓడించడమే కాంగ్రెసు లక్ష్యమని అన్నారు. గజ్వెల్ లో కేసిఆర్ కు డిపాజిట్ రాకుండా చేస్తామని కాంగ్రెసు నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. 

రాహుల్ గాంధీతో 20 నిమిషాల పాటు సమావేశమైన డిఎస్ పార్టీలో మాత్రం చేరలేదు. తెలంగాణ రాజకీయ వాతావరణంపై డిఎస్ రాహుల్ గాంధీతో చర్చించినట్లు చెబుతున్నారు. పార్టీలో చేరకున్నా కాంగ్రెసుకు తన సహాయం ఉంటుందని డిఎస్ రాహుల్ గాంధీకి చెప్పినట్లు తెలుస్తోంది. సాంకేతికంగా మాత్రమే డిఎస్ కాంగ్రెసులో చేరలేదు.

సంబంధిత వార్తలు

నేను కాంగ్రెస్ లో చేరానని ఎవరు చెప్పారు..? షాకిచ్చిన డీఎస్

ఢిల్లీకి డీఎస్ :రేపు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం

 కేసీఆర్ కీలక సమావేశానికి డీఎస్ హాజరు

కేసీఆర్‌తో భేటీ: డీఎస్ భవితవ్యంపై ఉత్కంఠ

ముహూర్తం ఖరారు: కాంగ్రెస్‌లోకి డీఎస్, కొండా సురేఖ

click me!