హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు

By narsimha lodeFirst Published Aug 29, 2018, 10:21 AM IST
Highlights

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది.

హైదరాబాద్: సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతోనే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది.

నెల్లూరు జిల్లా కావలిలో జరిగే ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో హరికృష్ణతో పాటు ఆరికపూడి వెంకటరావు,శివాజీ బుధవారం నాడు ఉదయం నాలుగున్నర గంటలకు హైద్రాబాద్‌ నుండి బయలు దేరారు. కారు నార్కట్‌పల్లి మండలం అన్నెపర్తికి చేరుకొన్న సమయంలో ప్రమాదానికి గురైంది.

రోడ్డుపై రాయి ఉందని ప్రత్యక్షసాక్షి శివాజీ చెబుతున్నారు. కారును హరికృష్ణ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆయన పక్క సీటులో శివాజీ కూర్చొన్నాడు. కారు బ్యాక్ సీటులో అరికపూడి వెంకటరావు కూర్చొన్నాడు.

అయితే అన్నెపర్తి సమీపంలో రోడ్డుపైనే రాయి ఉంది. ఈ రాయిని తప్పించే క్రమంలో డివైడర్ ను కారు ఢీకొట్టిందని శివాజీ చెబుతున్నాడు. శివాజీ, వెంకట్రావులు సీటు బెల్ట్ పెట్టుకొన్నారు. కారును డ్రైవ్ చేస్తున్న హరికృష్ణ మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోలేదు.

రాయిని తప్పించే క్రమంలో 120 కి.మీ వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టుకొంటూ మరో రహదారిపై  ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి కారు వెళ్లింది.

సీటు బెల్ట్ పెట్టుకొంటే హరికృష్ణ కారు నుండి బయటకు వచ్చేవారు కాదని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

 

ఈ వార్తలు చదవండి

కొంపముంచిన నిర్లక్ష్యం: సీటు బెల్ట్ పెట్టుకోక చనిపోయిన ప్రముఖులు వీరే

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ మృతి ( వీడియో)

బాబుతో హరికృష్ణకు విబేధాలు, ఎందుకంటే?

హరికృష్ణ మృతి: మూడు రోజుల్లోనే పుట్టినరోజు.... ఇంతలోనే దుర్మరణం

నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు

హరికృష్ణ మృతి: సీటు బెల్ట్ పెట్టుకొంటే బతికేవాడు,120 కి.మీ స్పీడ్‌లో కారు

రోడ్డు ప్రమాదాలతో టీడీపీకి దెబ్బ: కీలక నేతల దుర్మరణం

 

 

click me!