హరికృష్ణ మృతదేహం వద్ద బోరున విలపించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

Published : Aug 29, 2018, 10:15 AM ISTUpdated : Sep 09, 2018, 11:06 AM IST
హరికృష్ణ మృతదేహం వద్ద బోరున విలపించిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్

సారాంశం

 తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ షాక్ గురయ్యారు. 

హరికృష్ణ ఆకస్మిక మరణం అందరినీ ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది. తండ్రి హరికృష్ణ మృతదేహం వద్ద ఆయన తనయులు, సినీ హీరోలు కల్యాణ్‌రామ్‌, జూనియర్ ఎన్టీఆర్‌ బోరున విలపించారు. నార్కట్ పల్లి-అద్దంకి హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం స్థానికులు ఆయన్ను నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించగా అప్పటికే వైద్యులు హరికృష్ణ మృతిచెందినట్లు తెలిపారు. 

కాగా... తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే కొడుకులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ షాక్ గురయ్యారు. వెంటనే నార్కట్ పల్లికి బయలుదేరి వెళ్లారు. ఆసుపత్రి వద్దకు చేరుకున్న వారు తండ్రి హరికృష్ణ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: పసిఫిక్ నుంచి అరేబియా దాకా సముద్రంలో తుపాన్లు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు
సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి | Smart Ration Cards Launch