అప్పుడు మంచి వాళ్లం...ఇప్పుడు విమర్శలా..కొండా దంపతులకు కేటీఆర్ కౌంటర్

By Nagaraju TFirst Published 25, Sep 2018, 7:49 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నమాజీమంత్రి కొండా సురేఖ దంపతులకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో ఉన్నంత కాలం కొండా దంపతులకు తాము మంచి వాళ్లమని, పార్టీ నుంచి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

సిరిసిల్ల: టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నమాజీమంత్రి కొండా సురేఖ దంపతులకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో ఉన్నంత కాలం కొండా దంపతులకు తాము మంచి వాళ్లమని, పార్టీ నుంచి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు చూస్తున్నారని అందువల్లే టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబుట్టారు. 

టీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల ప్రజాబలమెంతో రాబోయే ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు. ఒకరికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, మరో పార్టీ నిస్సిగ్గుగా ఏకం అవుతున్నాయని కాంగ్రెస్, టీడీపీలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. 

విలువలకు తిలోదకాలు ఇచ్చి అధికారం కోసం కూటమి కడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ బాసులకు, అమరావతి నేతలకు గులాంలు అవుదామా? తెలంగాణ స్వాభిమానాన్ని వాళ్ల కాళ్ల దగ్గర పెడదామా? అని ప్రశ్నించారు. నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉంచుకుని ఆత్మగౌరవంతో ముందుకు వెళ్దామా? అని ప్రజలను ప్రశ్నించారు. 

మరోవైపు టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ ఆత్మవంచన చేసుకోవడం మానేయాలని సూచించారు. ప్రజాభిమానం ఉంది 119 స్థానాల్లో పోటీ చేస్తామన్నకోదండరామ్ ముష్టి 3 సీట్ల కోసం కాంగ్రెస్‌ చుట్టూ తిరుగుతూ పొర్లు దండాలు పెడుతున్నారని విమర్శించారు. 

ఇది ఏ రకమైన ప్రజాభిమానమో కోదండరామ్‌ ఆలోచించుకోవాలని సూచించారు. ఏ ఆలోచనతో పొత్తు పెట్టుకుంటున్నాయో కాంగ్రెస్‌, టీడీపీ ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

Last Updated 25, Sep 2018, 8:45 PM IST