బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ...సెలవులు ప్రకటించిన అధికారులు

By Arun Kumar PFirst Published Sep 25, 2018, 7:00 PM IST
Highlights

నిర్మల్ జిల్లాలోని ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పేరుకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ...కానీ విద్యాబోదన అద్వాన్నంగా ఉందంటూ విద్యార్థులు సోమవారం ఆందోళన మొదలుపెట్టారు. ఈ ఆందోళన ఇవాళ కూడా కొనసాగింది.  ట్రిపుల్ ఐటీ అధికారులు తమ సమస్యలను పరిష్కరించకుండా సెలవులు ప్రకటించి ఇంటికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. 

అధికారులు సెలవులు ప్రకటించడంతో హాస్టళ్లను ఖాళీ చేయించడానికి అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పురుషులతో పాటు మహిళా హాస్టళ్లు కరెంట్, నీటి సరఫరా నిలిపివేశారు. మెస్ సదుపాయాన్కిన కూడా నిలిపివేయంతో విద్యార్థులు ఆకలితోనే ఆందోళన కొనసాగిస్తున్నారు.  

ఈ నిరసనను అడ్డుకోడానికి పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు.  అయితే అధికారులు, పోలీసుల బెదిరింపులకు బయపడేది లేదని, మంచి ప్యాకల్టీని నియమించే వరకు నిరసనను కొనసాగిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని విసి నుండి లిఖిత పూర్వక హామీ కావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.   
 
click me!