షోకాజ్: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డోంట్ కేర్

By narsimha lodeFirst Published Sep 25, 2018, 6:30 PM IST
Highlights

గడువు ముగిసినా కానీ షోకాజ్ నోటీసుకు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు

హైదరాబాద్: గడువు ముగిసినా కానీ షోకాజ్ నోటీసుకు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సమావేశం కానుంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాలుగు రోజుల క్రితం తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సమావేశమై  షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులపై సోమవారం నాడు ఉదయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీల్డ్ కవర్లో  వివరణ ఇచ్చారు. అయితే  షోకాజ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత గత శుక్రవారం నాడు సాయంత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి  క్రమశిక్షణ సంఘం నేతలపై కూడ  విమర్శలు గుప్పించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం  రెండో సారి షోకాజ్ నోటీసు జారీ చేసింది.

24 గంటల్లోపుగా ఈ షోకాజ్ కు సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది. అయితే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఇంతవరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నుండి వివరణ అందలేదు

సంబంధిత వార్తలు

వదల బొమ్మాళీ: కోమటిరెడ్డికి మరో షోకాజ్ నోటీసు

 

సీల్డ్‌కవర్లో వివరణ: కోమటిరెడ్డి భవితవ్యంపై ఉత్కంఠ

కాంగ్రెసుపై బ్రదర్ ఫైర్: కీలక భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజర్

కేసీఆర్ ను తిడితేనే పదవులిస్తారా: రేవంత్ కు కోమటిరెడ్డి సెటైర్

వీహెచ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కుంతియా స్పందన ఇదీ

కోమటిరెడ్డికి షాక్: షోకాజ్ నోటీసులిచ్చిన కాంగ్రెస్

గాంధీభవన్ లో డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారు: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసమ్మతిపై అధిష్టానం ఆగ్రహం: కోమటిరెడ్డికి నోటీసులు?

ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

 

click me!