WhiteChallenge : ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్టుకు నేను రెడీ.. రాహుల్ గాంధీ రెడీనా?.. రేవంత్ కు కేటీఆర్ సవాల్...

By AN TeluguFirst Published Sep 20, 2021, 9:50 AM IST
Highlights

డ్రగ్స్ పరీక్ష చేయించుకుని క్లీన్ గా బైటికి వస్తే రేవంత్ పదవి నుంచి తప్పుకుంటావా? అంటూ సవాల్ విసిరాడు. చర్లపల్లిలో జీవితం గడిపిన వ్యక్తులే రాహుల్ ను ఒప్పించాలి అన్నారు. అలాగే ఓటుకు నోటు కేసులో నువ్వు లై డిటెక్టర్ టెస్తుకు సిద్దమా? అంటూ రేవంత్ కు ఛాలెంజ్ విసురుతూ ట్విటర్ వేదికగా ఘాటుగా పోస్ట్ పెట్టారు తెలంగాణ ఐటీపరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. 

ఎయిమ్స్ లో టెస్టుకు రాహుల్ గాంధీ రావడానికి ఇష్టపడితే.. నేను ఢిల్లీకి రావడానికి కూడా రెడీ అంటూ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ కు మంత్రి కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. నేను ఏ పరీక్షకైనా సిద్ధమే.. ఇక్కడ కాదు ఢిల్లీ ఎయిమ్స్ లోనే పరీక్ష చేయించుకుంటా.. మీ రాహుల్ గాంధీ చేయించుకుంటాడా? అంటూ చురకలేశారు. 

అంతేకాదు డ్రగ్స్ పరీక్ష చేయించుకుని క్లీన్ గా బైటికి వస్తే రేవంత్ పదవి నుంచి తప్పుకుంటావా? అంటూ సవాల్ విసిరాడు. చర్లపల్లిలో జీవితం గడిపిన వ్యక్తులే రాహుల్ ను ఒప్పించాలి అన్నారు. అలాగే ఓటుకు నోటు కేసులో నువ్వు లై డిటెక్టర్ టెస్తుకు సిద్దమా? అంటూ రేవంత్ కు ఛాలెంజ్ విసురుతూ ట్విటర్ వేదికగా ఘాటుగా పోస్ట్ పెట్టారు తెలంగాణ ఐటీపరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. 

అంతకుముందు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా... కేటీఆర్ కు సవాల్ విసిరారు. యువతలో డ్రగ్స్ ముప్పు మీద అవగాహన కల్పించడానికి #WhiteChallenge చేపట్టామని కె.విష్ రెడ్డి దీన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పుకొచ్చారు. మేమిద్దరం కేటీఆర్ ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చేయాలని ఎదురుచూస్తున్నామని.. కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.  

కాగా, రెండు రోజుల క్రితం గజ్వేల్ సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు రేవంత్. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరవుతున్నవారు ఎవరి దోస్తులంటూ ఆయన ప్రశ్నించారు. కాగా, రేవంత్  రెడ్డి వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. తనకు డ్రగ్స్ కేసులో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తాను డ్రగ్స్ అనాలిసిస్ టెస్టులకు సిద్ధమని .. రాహుల్ గాంధీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ ప్రయోజనాలు, పురోగతి, గణాంకాల విషయంలో తప్పుదారి పట్టిస్తే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు. మీడియాతో చాట్ చాట్‌లో ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్.

ఎవడో పిచ్చోడు ఈడీకి లేఖ రాశాడు: డ్రగ్స్ ఇష్యూపై కేటీఆర్ సీరియస్ వ్యాఖ్యలు

ఆ వెంటనే శనివారం సాయంత్రం స్పందించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ వైట్ ఛాలెంజ్‌కు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. అలాగే డ్రగ్స్ వ్యవహారంలోకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని లాగారు. డ్రగ్స్ మహమ్మారి బారినపడిన యువతను కాపాడాల్సిన బాధ్యత మనపై వుందని ఆయన చెప్పారు. యువత పెడదారిన పడకుండా ఆదర్శవంతంగా రాజకీయాలకు, విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు రావాల్సిందిగా రేవంత్ కోరారు. ఈడీ సమాచారం అడిగితే ఇచ్చేది లేదని తెలంగాణ ఎక్సైజ్ శాఖ చెప్పిందని... అలాగే ఈడీ విచారణ రద్దు చేయాల్సిందిగా హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసిందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలు విచారణ చేస్తామంటే మీకొచ్చిన అభ్యంతరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ విచారణకు పిలిచినప్పుడు రానా, రకుల్ ప్రీత్ సింగ్ లేరని.. కానీ ఈడీ మాత్రం రానా, రకుల్ ప్రీత్ సింగ్‌లను పిలిచిందని రేవంత్ స్పష్టం చేశారు. వీరిద్దరిని కాపాడింది ఎవరని .. ఆ సీక్రెట్ మిత్రుడు ఎవరు అని ఆయన ప్రశ్నించారు. 2017లో డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి తాను వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని బట్టే ఈడీ విచారణ జరిపిందని  రేవంత్ తెలిపారు.

click me!