కేసీఆర్‌తో ఎంఐఎం చీఫ్ అసద్ భేటీ

By narsimha lodeFirst Published Dec 12, 2018, 12:59 PM IST
Highlights

ఎంఐఎం చీఫ్  అసదుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో బుధవారం నాడు ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు


హైదరాబాద్: ఎంఐఎం చీఫ్  అసదుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో బుధవారం నాడు ప్రగతి భవన్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌తో అసద్ భేటీ కావడం ఇదే ప్రథమం.

ఎన్నికల ఫలితాలు  వెలువడడానికి  ముందు రోజు కేసీఆర్‌తో అసదుద్దీన్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో  తమ పార్టీ అవసరం లేకుండానే  కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.

దేశ రాజకీయాల్లో  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటులో ఎంఐఎం చీఫ్ అసద్‌తో కలిసి పర్యటించనున్నట్టు  కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో బుధవారం నాడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ భేటీ అయ్యారు.

సుమారు  గంటకుపైగా కేసీఆర్‌తో  ఎంఐఎం చీఫ్  అసదుద్దీన్‌ ఓవైసీ భేటీ అయ్యారు. దేశ రాజకీయాల్లో కొత్త ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చించినట్టు సమాచారం.రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న కేసీఆర్ కు అసద్ శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అసద్‌తో కలిసి దేశ రాజకీయాలను మలుపు తిప్పుతా: కేసీఆర్

నెల ఆగండి, దేశ రాజకీయాల్లో సత్తా చాటుతా: కేసీఆర్

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక
శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్

click me!