ట్రక్కు గుర్తుతో ఉత్తమ్ శిఖండి పాత్ర: సైదిరెడ్డి

sivanagaprasad kodati |  
Published : Dec 12, 2018, 12:52 PM IST
ట్రక్కు గుర్తుతో ఉత్తమ్ శిఖండి పాత్ర: సైదిరెడ్డి

సారాంశం

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హుజూర్‌నగర్‌ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉత్తమ్ కుమార్ రెడ్డి శిఖండిలా కారు గుర్తులా ఉండే ట్రక్కు గుర్తును అడ్డుపెట్టుకొని విజయం సాధించాడని విమర్శించారు. 

ఎన్నికలకు 15 రోజుల ముందు నియోజకవర్గానికి వచ్చి ఉత్తమ్‌కుమార్‌కు గట్టి పోటీ ఇచ్చానన్నారు. భవిష్యత్త‌ులో ఆయన్ను ఇక్కడ పోటీ చేయకుండా పారిపోయేలా చేస్తానని సైదిరెడ్డి అన్నారు. ఓటమితో కుంగేది లేదని.. 100 శాతం నైతికంగా తానే గెలిచానని సైదిరెడ్డి స్పష్టం చేశారు.

50 వేల లోపు మెజారిటీ రాకపోతే రాజీనామా చేస్తానన్న ఉత్తమ్ మాట మీద నిలబడతారా అని ఆయన ప్రశ్నించారు. వట్టి మాటలు మాట్లాడే ఉత్తమ్ రాజకీయాలు ఇకపై హుజూర్‌నగర్‌లో నడవనీయనన్నారు. ఉత్తమ్ గడ్డం తీసేది లేదని ఇక ఎన్నాళ్లైనా అలాగే ఉంచాల్సిందేనని సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ టీఆర్ఎస్‌కు ఎదురులేకుండా చేసి ఉత్తమ్‌ను తరిమికొట్టడమే తన లక్ష్యమన్నారు. 
 
PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.