కేసీఆర్ ప్రమాణానికి ముహుర్తం ఇదే: ఒక్కరితోనే కొలువు

By narsimha lodeFirst Published Dec 12, 2018, 12:13 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో  రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.డిసెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం 1.10 గంటలకు సీఎంగా కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.

రెండో సారి సీఎంగా  ఏ రోజున ప్రమాణం చేయాలనే  విషయమై కేసీఆర్ జ్యోతిష్య పండితులతో చర్చించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ పూర్తిస్థాయి కేబినెట్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

సీఎంతో పాటు ఒక్కరు మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి లేదా ముస్లింకు చెందిన వారితో ప్రమాణం చేస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

 డిసెంబర్ 13వ తేదీన  తెలంగాణ సీఎంగా రెండో సారి కేసీఆర్  ప్రమాణం చేస్తారు.రేపు ఉదయం 11 గంటల్లోపుగా  మూడు మంచి ముహుర్తాలు ఉన్నాయి.  ఈ ముహుర్తాల్లో మంచి ముహుర్తంలో కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేసే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.  

ఈ ముహుర్తాల్లో మధ్యాహ్నం 1.10 గంటలకు ఉన్న ముహుర్తాన్ని కేసీఆర్ ఎంచుకొన్నారు.రాజ్‌భవన్  లో కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు.తొలుత ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేయడంతో పాటు నలుగురు లేదా ఐదుగురు మంత్రులతో ప్రమాణం చేసే అవకాశం ఉందని  ప్రచారం సాగింది.

ఐదుగురు  లేదా 13 మందిని కేబినెట్‌లోకి తీసుకొనే అవకాశం ఉందని కూడ టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.ఇదిలా ఉంటే కేసీఆర్ తో పాటు ఒక్కరు మాత్రమే మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. 

పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి కేబినెట్‌ సిద్దం చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.సీఎంతో పాటు 18 మందితో మంత్రిమండలి మించకూడదు. దీంతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే అప్పటి అవసరాలకు అనుగుణంగా పూర్తిస్థాయి కేబినెట్‌ను తీసుకొనే అవకాశం ఉంటుందంటున్నారు. 

గత టర్మ్‌లో మంత్రులుగా ఉన్న నలుగురు ఓటమి పాలయ్యారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఈ దఫా కొత్త ముఖాలకు చోటు దక్కే అవకాశం లేకపోలేదు. మహిళలకు కూడ ఈ దఫా మంత్రివర్గంలో చోటు దక్కనుంది. అయితే గతంలో మంత్రులందరికీ ఈ దఫా మంత్రివర్గంలో ఛాన్స్ ఉండకపోవచ్చే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 

టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం డిసెంబర్ 12 వతేదీన టీఆర్ఎస్ భవన్ లో జరగనుంది. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం విషయమై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభపక్షనేతగా కేసీఆర్ ను ఎన్నుకొంటారు. టీఆర్ఎస్ శాసనసభపక్షనేతగా ఎన్నుకొన్న లేఖను కేసీఆర్ గవర్నర్ కు సమర్పించనున్నారు.


 


 

click me!