
ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, ‘మనం సైతం’ కాదంబరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "క్యాన్సర్ అనేది భయపెట్టే వ్యాధి అని చాలామందికి అనిపిస్తుంది. కానీ తొలి దశలో గుర్తిస్తే, దాన్ని పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే ఈ శిబిరం వంటి అవకాశాలను అందరూ ఉపయోగించుకోవాలి" అని పిలుపునిచ్చారు.
మెడికవర్ హాస్పిటల్స్ ఇండియా చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ డెగ్లూర్కర్ మాట్లాడుతూ.. "క్యాన్సర్ నిర్ధారణలో ఆలస్యం చేయకూడదు. మేము అత్యాధునిక వైద్య సాంకేతికతతో, అనుభవజ్ఞులైన వైద్యుల బృందంతో ఉత్తమ సేవలు అందిస్తున్నాం. ఈ ఉచిత శిబిరం ద్వారా ప్రజలు సకాలంలో పరీక్షలు చేయించుకుని, ప్రాణాలను కాపాడుకోవచ్చు" అన్నారు.
మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ హెడ్ సువన్కర్ గారు మాట్లాడుతూ.. "ప్రజల్లో క్యాన్సర్‌పై భయాన్ని తగ్గించి, సమయానికి పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన కల్పించడం మా ప్రధాన ఉద్దేశ్యం" అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో డాక్టర్ అజయ్ వరుణ్ రెడ్డి, డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.
శిబిరంలో ప్రజలకు పూర్తిగా ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
* మమ్మోగ్రఫీ – రొమ్ము క్యాన్సర్ గుర్తింపు కోసం
* పాప్‌స్మియర్ టెస్ట్ – సర్వికల్ క్యాన్సర్ నిర్ధారణ కోసం
* పీ.యూ.ఎస్ స్కాన్ – పురుషులకు ప్రొస్టేట్ క్యాన్సర్ పరీక్ష
* క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ – నిపుణుల సలహాలు, మార్గదర్శకాలు
సమయం: ప్రతి రోజు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు
సంప్రదించవలసిన నంబర్: 040 6833 4455
ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకొని, ఆరోగ్యకరమైన జీవనానికి ముందడుగు వేయాలని మెడికవర్ వైద్య బృందం కోరుతోంది.