
Khazana Jewellery Case: హైదరాబాద్‌లోని చందానగర్ ఖజానా జ్యువెలర్స్‌లో మంగళవారం ఉదయం 10.30 గంటలకు భయంకరమైన దోపిడీ జరిగింది. ఆరుగురు దుండగులు మాస్కులు, క్యాపులు, గ్లౌజులు ధరించి రెండు బైక్‌లపై వచ్చి దుకాణంలోకి చొరబడ్డారు. తుపాకులతో బెదిరిస్తూ.. దుకాణంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి సిబ్బందిని భయాందోలనకు గురిచేశారు. దాదాపు 10 నిమిషాలపాటు బీభత్సం సృష్టించారు.
సిబ్బందిలో ఒకరిపై కాల్పులు జరిపి, లాకర్‌లోని వెండి, గోల్డ్ ఆభరణాలను దోచుకున్నారు. అక్కడి నుంచి పారారయ్యారు. వెంటనే ఖజానా జ్యువెలర్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే పోలీసులు త్వరితగతి స్పందించి విచారణ ప్రారంభించారు.
ఈ క్రమంలోనే పటాన్ చెరువు సర్వీసు రోడ్, సంగారెడ్డి సమీపంలో మొత్తం ఆరుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోపిడీకి ఉపయోగించిన బైకులు కూడా వారు దొంగిలించినవేనని గుర్తించారు. పోలీసులు మరికొందరిని గుర్తించడానికి, ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరున్నారనే విషయంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
మొదట నిందితులు మాస్కులు, టోపీలు, హెల్మెట్లు ధరించి షాప్ లోకి వచ్చి తుపాకులతో సిబ్బందిని బెదిరించారు. కాల్పులు కూడా జరపడంతో స్థానికంగా భయాందోళనలు చెలరేగాయి. పోలీసులు నిందితులను గుర్తించడానికి సుమారు 100 సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
సైబరాబాద్ పోలీస్, మాదాపూర్ డీసీపీ, చందానగర్ ఇన్‌స్పెక్టర్‌లతో పది ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసులను అప్రమత్తం చేసి, ముఠాలను అంతరాష్ట్ర స్థాయిలో గమనిస్తున్నారు. దోపిడీకి ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.
ఆరుగురు అరెస్టు అయినప్పటికీ, దోపిడీ వెనుక ఉన్న పెద్ద ముఠా, ఇతర సహచరులను గుర్తించడం, వారి భవిష్యత్తు దోపిడీ ప్రయత్నాలను నిరోధించడంపై కోసం పోలీసులు మరింత లోతైన విచారణ జరుపుతున్నారు.