భర్తకు ఎయిడ్స్ సోకిందని... బంధువుతో భార్య అక్రమ సంబంధం

By sivanagaprasad kodatiFirst Published Nov 15, 2018, 8:56 AM IST
Highlights

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య దారుణంగా హత్య చేసింది. 

తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య దారుణంగా హత్య చేసింది. రాజమండ్రి సమీపంలోని మల్లేపల్లి గ్రామానికి చెందిన తోట దుర్గారావు డ్రైవర్. భార్యా పిల్లలు ఉన్నప్పటికీ 2013లో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు.. వీరిద్దరు పిల్లలు.

అయితే దురలవాట్ల కారణంగా అతనికి టీబీ, హెచ్ఐవీ సోకింది....ఈ క్రమంలో దుర్గారావు తన కాపురాన్ని కాకినాడ సమీపంలోని కరప గ్రామానికి మార్చాడు. భర్త హెచ్ఐవీ రోగి అని తెలుసుకున్న లావణ్య అతనిని దూరం పెట్టి...సమీప బంధువైన వాసంశెట్టి వీర రామకృష్ణకు దగ్గరైంది.

2015లో రామకృష్ణ హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు కుటుంబంతో సహా వచ్చి..  ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.. 2018 సెప్టెంబర్‌లో దుర్గారావు, లావణ్య కూడా నగరానికి రావడంతో.. రామకృష్ణ వారికి అద్దె ఇల్లు ఇప్పించాడు. అప్పటికే వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉండటంతో.. దుర్గారావు లేని సమయంలో రామకృష్ణ.. లావణ్యతో గడిపేవాడు.

గత నెల 31వ తేదీన రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన దుర్గారావు తన భార్య లావణ్య, రామకృష్ణ ఒకే గదిలో అభ్యంతరకర రీతిలో ఉండటాన్ని చూసి కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలో ముగ్గురికి గొడవ జరగడంతో లావణ్య తన చేతికి అందిన ఇనుప ట్యాప్ వాటర్‌పైప్‌ను భర్త తలపై కొట్టింది.

వెంటనే ప్రియుడితో కలిసి చున్నీతో దుర్గారావు మెడకు ఉరివేసి హతమార్చింది.. తరువాతి రోజు ఉదయం రామకృష్ణ తాను పనిచేస్తున్న సంస్థ నుంచి ఓ వ్యాన్ తీసుకొచ్చి.. అందులో దుర్గారావు శవాన్ని తీసుకుని కీసర హైవేలోని పొదల్లో పడేశాడు. లావణ్య పిల్లలను తీసుకుని కాకినాడకు వెళ్లిపోయింది..

ఈ నెల 2 గుర్తు తెలియని మృతదేహం ముళ్లపొదల్లో ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని పరిశీలించి హత్యగా కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా హైవేలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఓ వ్యానును గుర్తించారు.

దాని నెంబర్ ఆధారంగా అదే ఏ కంపెనీదో గుర్తించి యజమాని వద్ద పనిచేసే నలుగురు డ్రైవర్లను గుర్తించి ఆరా తీయగా.. చివరికి రామకృష్ణ హత్య జరిగిన రోజు అటుగా సంచరించడాన్ని గమనించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రామకృష్ణతో పాటు లావణ్యను సైతం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

మోడల్ తో అక్రమ సంబంధం..భార్యను అడ్డు తప్పించేందుకు

వివాహితతో అక్రమ సంబంధం.. నీలదీసిన భార్యను..

ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్త దారుణ హత్య

భార్యని కాదని వేరే మహిళతో అక్రమ సంబంధం.. ఓనర్ హత్య

ధనవంతుడి అక్రమ సంబంధం.. రక్షిస్తామని.. రూ.4 కోట్లు వసూలు చేసిన పోలీసులు

వదినతో అక్రమ సంబంధం.. చివరికిలా...

తమ్ముడితో అక్రమ సంబంధం..చివరికి ప్రాణాల మీదకి

కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సజీవదహనం చేసిన తండ్రి

దెయ్యం పేరుతో భర్త కళ్లుగప్పి.. నవవధువు అక్రమ సంబంధం

తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని.. కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు

కానిస్టేబుల్ భార్యతో ఏకాంతంగా ఎస్ఐ.. కిందపడిన సిగరెట్.. బయటపడిన అక్రమ సంబంధం..ఎలా..?

click me!