మనోహరాచారి చావాలనుకున్నాడు: రైళ్లు రాక విసిగిపోయి...

By pratap reddyFirst Published Sep 21, 2018, 12:01 PM IST
Highlights

దాడి చేసిన తర్వాత మనోహరచారి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజు సాయంత్రం 5:10 సమయంలో భార్యకు ఫోన్‌ చేసి పని అయిపోయిందని, తాను ఇక ఇంటికి రాను చచ్చిపోతానని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. 

హైదరాబాద్: అల్లుడు, కూతుళ్లపై హైదరాబాదులోని ఎర్రగడ్డలో దాడి చేసిన తర్వాత మనోహరాచారి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. కానీ, చివరికి బావమరిది నరహరి ఇంటికి చేరుకుని పోలీసులకు చిక్కాడు.

దాడి చేసిన తర్వాత మనోహరచారి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ రోజు సాయంత్రం 5:10 సమయంలో భార్యకు ఫోన్‌ చేసి పని అయిపోయిందని, తాను ఇక ఇంటికి రాను చచ్చిపోతానని చెప్పి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. ఫోన్‌ ఆన్‌లో ఉంటే దొరికి పోతానని అలా చేశాడు. 
ఆ తర్వాత డివైడర్‌ దాటి అక్కడ ఆటో ఎక్కాడు. 

ఎస్‌ఆర్‌నగర్‌, డీకే రోడ్‌ మీదుగా అమీర్‌పేట పార్క్‌ హోటల్‌ వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఆటోను ఆపి డబ్బులు చెల్లించి అక్కడి నుంచి ముందుకు నడిచిపోయాడు. గ్రీన్‌ల్యాండ్‌ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న భవనంలో సెల్‌ఫోన్‌ను పడేశాడు. 

ఆ తర్వాత కాలినడకన కుందన్‌బాగ్‌ మీదుగా రైల్వే పట్టాల వద్దకు చేరుకున్నాడు. ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. ఆ సమయంలో రైళ్లు రాకపోవడంతో విసిగిపోయాడు. అక్కడి నుంచి బీఎస్‌ మక్తాలో ఉన్న బావమరిది నరహరి ఇంటికి బయలుదేరాడు.

సంబంధిత వార్తలు

భార్యకు చివరి కాల్: అదే మనోహరాచారిని పట్టిచ్చింది

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

Last Updated Sep 21, 2018, 12:05 PM IST