ఇక్కడ కేసీఆర్‌కు, అక్కడ జగన్‌కు కోవర్టులు: వీహెచ్ సంచలనం

By narsimha lodeFirst Published Sep 21, 2018, 11:47 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ పదవిని తాను కోరుకోలేదని.... పార్టీ నాయకత్వమే తనకు ఆ పదవిని ఇస్తానని చెప్పిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు చెప్పారు.


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ పదవిని తాను కోరుకోలేదని.... పార్టీ నాయకత్వమే తనకు ఆ పదవిని ఇస్తానని చెప్పిందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు చెప్పారు. పార్టీ తనకు పదవులు  ఇవ్వకపోయినా పార్టీని వీడబోనని ఆయన చెప్పారు.  అంతేకాదు  కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో  కేసీఆర్‌కు, ఏపీలో జగన్‌కు  ‌కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం నాడు ఆయన ఓ తెలుగున్యూస్ ఛానెల్‌‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్  పార్టీలో  కోవర్టులు ఉన్నారని  హనుమంతరావు అభిప్రాయపడ్డారు.  ఈ కోవర్టుల జాబితాను  రాహుల్ ‌గాంధీకి అందజేస్తానని ఆయన వివరించారు. 

తాను ఏనాడూ కూడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయనని చెప్పారు.  తనకు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మెన్ పదవిని ఇస్తామని పార్టీ నాయకత్వమే తనకు హమీ ఇచ్చిందన్నారు. కానీ, ప్రచార కమిటీలో తనకు  స్థానం కల్పించలేదన్నారు.

కొందరు  పార్టీ నేతలు  పార్టీకి నష్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వీహెచ్ చెప్పారు. పార్టీని వీడిన కేఆర్ సురేష్ రెడ్డి పేరును మూడు కమిటీల్లో చేర్చిన విషయాన్ని వి.హనుమంతరావు గుర్తు చేశారు.

ప్రచారకమిటీలో తనకు బాధ్యతలు ఇవ్వకపోయినా  తాను రాష్ట్ర వ్యాప్తంగా  పర్యటించి కాంగ్రెస్ పార్టికి అనుకూలంగా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు.తనకు ఎందుకు ప్రచార కమిటీలో బాధ్యతలు ఎందుకు ఇవ్వలేదనే తాను ప్రశ్నిస్తున్నట్టు  వి.హనుమంతరావు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన కమిటీలపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చేసిన విమర్శలపై తాను  స్పందించబోనని వి.హనుమంతరావు తెలిపారు. లోకల్ లీడర్లే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారన్నారు.ఈ విషయాలన్నింటిని తాను రాహుల్ గాంధీకి వివరిస్తానని చెప్పారు.

గతంలో కూడ తనను పక్కన పెట్టారని చెప్పారు. తనను పక్కన పెట్టినా కూడ తాను పార్టీని వీడబోనని చెప్పారు. పార్టీలోనే ఉంటూ... పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారి భరతం పడతానని తేల్చిచెప్పారు. ఇతరులకు ఎందుకు పదవులు ఇచ్చారనే విషయాన్ని తాను అడగనని చెప్పారు.  కానీ, తనకు ఎందుకు పదవి ఇవ్వలేదనే విషయాన్ని మాత్రమే తాను అడుగుతానని చెప్పారు.

సంబంధిత వార్తలు

టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

 

click me!