భార్యకు చివరి కాల్: అదే మనోహరాచారిని పట్టిచ్చింది

By pratap reddyFirst Published Sep 21, 2018, 11:45 AM IST
Highlights

భార్యతో మాట్లాడిన తర్వాత మనోహరాచారి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో పోలీసులకు అతని ఆచూకీ కనిపెట్టడం కష్టమైంది. అయితే, భార్యకు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.  

హైదరాబాద్: హైదరాబాదులోని ఎర్రగడ్డలో కూతురు, అల్లుళ్లపై కత్తితో దాడి చేసిన తర్వాత చేసిన చివరి కాల్ మనోహరచారిని పట్టిచ్చింది. వారిద్దరిపై దాడి చేసిన తర్వాత అతను భార్యకు ఫోన్‌ చేశాడు. పని అయిపోయిందని, తాను ఇక ఇంటికి తిరిగిరానని, వెళ్లిపోతున్నానని అతను భార్యకు ఫోన్ లో చెప్పాడు. 

భార్యతో మాట్లాడిన తర్వాత మనోహరాచారి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో పోలీసులకు అతని ఆచూకీ కనిపెట్టడం కష్టమైంది. అయితే, భార్యకు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.  
 
మనోహరచారి ఇంటిని గుర్తించడానికి అతడి వివరాలను తెలుసుకోవడానికి కూడా పోలీసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాడి అనంతరం తన టూవీలర్ ను సంఘటన స్థలంలోనె వదిలేసి పారిపోయాడు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

దాని నెంబర్‌ ఆధారంగా అతని ఇంటిని గుర్తించే ప్రయత్నం చేశారు. ఆర్‌సీ బుక్‌లో ఉన్న చిరునామా ఆధారంగా అక్కడికి ప్రత్యేక బృం దం వెళ్లింది. అక్కడికి వెళ్లిన పోలీసులకు నిరాశే ఎదురైంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు వారికి పోలీసులకు తెలిసింది. వినాయక్ నగర్ లో ఉంటున్నట్లు అక్కడి వారు చెప్పారు. దాంతో చివరకు చిరునామాను గుర్తించారు.
 
ఆటోలో అతను బావమరిది ఇంటికి చేరుకున్నాడు. చివరగా 5:30 గంటల ప్రాంతాన భార్య లక్ష్మికి మనోహరాచారి ఫోన్ చేశాడు. నిందితుడి ఫోన్‌నెంబర్‌ తెలుసుకున్న ప్రత్యేక బృందం చివరిసారి చేసిన ఫోన్‌ నెంబర్‌ ఆయన భార్య లక్ష్మిదిగా పోలీసులు గుర్తించారు. 

ఆ సమయంలో లక్ష్మి ఉన్న స్థలాన్ని సెల్‌ఫోన్‌ టవర్‌ ఆధారంగా గుర్తించారు. వెంటనే ఎస్‌ఐ రాజేందర్‌గౌడ్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందం బీఎస్‌ మక్తాలోని బావమరిది నరహరి ఇంటికి చేరుకుంది. రాజేందర్‌గౌడ్‌ నరహరిని విచారిస్తున్న క్రమంలో భుజానికి బ్యాగ్‌ వేసుకుని మనోహరాచారి నేరుగా ఇంట్లోకే వచ్చాడు. 

అక్కడ పోలీసులు ఉండడంతో ఆశ్చర్యపోయిన మనోహరాచారి వెనక్కి తిరిగి పారిపోవాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు అతడ్ని గట్టిగా పట్టుకున్నారు. బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. పోలీసు స్టేషన్‌కు తరలించి బ్రీత్‌ ఎన్‌లైజర్‌ ద్వారా పరీక్షించగా 357 పాయింట్లు వచ్చాయి.

సంబంధిత వార్తలు

మనోహరాచారి చావాలనుకున్నాడు: రైళ్లు రాక విసిగిపోయి...

మాధవి కేసులో మందకృష్ణ మాదిగ అనుమానం ఏంటంటే

సైకోలా చేస్తాడనే పెళ్లి గురించి ముందే డాడీకీ చెప్పలేదు: మాధవి సోదరుడు

నా భార్యే కారణం, ఆమెనే చంపాల్సింది: మనోహారాచారి

ఇంకా మాధవి పరిస్థితి విషమంగానే: హెల్త్ బులెటిన్ విడుదల

'మూడు మర్డర్లు చేశాను... కానీ... మారుతీరావులా చేయను'

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

click me!