బాలికను గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకుంటానని.. ఆత్మహత్య చేసుకున్నాడు

sivanagaprasad kodati |  
Published : Sep 21, 2018, 11:22 AM IST
బాలికను గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకుంటానని.. ఆత్మహత్య చేసుకున్నాడు

సారాంశం

ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ మండలం కొరిటికల్ గ్రామానికి చెందిన కిరణ్‌కుమార్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను మూడేళ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో బాలికతో శారీరకంగా బాగా దగ్గరవ్వడంతో ఆమె గర్భవతి అయ్యింది.

భయపడిన బాలిక తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టింది.. దీంతో గ్రామపెద్దల సమక్షంలో 10 రోజుల క్రితం కిరణ్, అతని తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. ఒప్పందం ప్రకారం 19న ముహూర్తంగా నిర్ణయించారు. అయితే ముహూర్తం సమయానికి కిరణ్ వివాహ వేదిక వద్దకు రాకపోవడంతో పెద్దలు అతని తల్లిదండ్రులను నిలదీశారు. తిరిగి 20వ తేది గురువారం పెళ్లిని మార్చారు.

ఈసారి ఎలాగైనా కిరణ్‌ను వివాహ వేదిక వద్దకు తీసుకు వచ్చేందుకు వీలుగా యాదగిరి అనే యువకుడిని గ్రామపెద్దలు అతనికి కాపలా ఉంచారు. బుధవారం సాయంత్రం యాదగిరి.. కిరణ్‌ను తనతో పాటే ఆత్మకూరులోని ఇంటికి తీసుకువెళ్లాడు. ఉదయాన్ని వివాహానికి వెళ్దామని యాదగిరి కిరణ్‌ను కోరగా.. తాను బహిర్భూమికి వెళ్లి.. తర్వాత తన అన్నలతో కలిసి అక్కడికి వస్తానని చెప్పడంతో యాదగిరి కొరటికల్‌కు వెళ్లాడు.

ఆ వెంటనే కిరణ్ సమీపంలోని మామిడితోటకు వెళ్లి ఇనుప తీగతో ఉరి వేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామపెద్దలు తమ కుమారునికి బలవంతంగా వివాహానికి ఒప్పించడంతో.. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక కిరణ్ చనిపోయాడని వారు వాదిస్తున్నారు. దీనిపై మృతుని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

సంగారెడ్డి భహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| CM Revanth Reddy Smart Ration Cards Launch
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Independence Day Speech