ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసు... నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

By Arun Kumar PFirst Published Dec 7, 2021, 9:51 AM IST
Highlights

చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారికి వణుకు పుట్టేలా నాంపల్లి కోర్టు ఓ కామాంధుడికి కఠిన శిక్ష విధించింది. 

హైదరాబాద్‌: అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించింది న్యాయస్థానం. ఓ చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు (nampalli court) తీర్పు వెలువరించింది.  

హైదరాబాద్ (hyderabad) లంగర్ హౌస్ లో ఓ ఏడేళ్ల చిన్నారి అత్యాచారానికి గురయ్యింది. ఇలా చిన్నారిపై అత్యంత కర్కషంగా అఘాయిత్యానికి పాల్పడిన పెద్ద పకీరప్ప(38) ను పోలీసులు అరెస్ట్ చేసారు. అతడిపై పోక్సో చట్టం (POCSO ACT)తో పాటు అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. చిన్నారి జీవితంతో ఆడుకున్న ఈ నీచుడిని కఠిన శిక్ష పడేలా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించారు. 

ఈ అత్యాచారానికి సంబంధించి నాంపల్లి కోర్టులో ఇంతకాలం విచారణ జరిగింది. తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. పకీరప్ప చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు రుజువవడంతో జీవిత ఖైదు శిక్ష (Life Imprisonment) విధించిన నాంపల్లి కోర్టు. అలాగే నిందితుడికి రూ.28వేల జరిమానా విధించింది. 

read more  సేవ పేరుతో చిన్నారులపై పైశాచికత్వం.. రౌడీషీటర్ కు దేహశుద్ధి....

ఈ కేసులో నిందితుడికి శిక్ష పడటంలో ఫోక్సో చట్ట లీగల్‌ సపోర్టు అధికారి స్పందన సదాశివ కీలకంగా వ్యవహరించారు. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన స్పందన ఎప్పటికప్పుడు కేసును పరిశీలించి న్యాయం జరిగేలా చూసారు. నిందితుడికి జైలు శిక్ష పడటంతో ఆమెను అభినందిస్తున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోనూ ఓ చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి ఇదే శిక్ష విధించిన న్యాయస్థానం. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి విచారణ ప్రారంభమైన కేవలం ఐదు రోజుల్లోనే జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది న్యాయస్థానం. అలాగే రూ. 1 జరిమానాను కూడా విధించారు.  బాలికలపై అత్యాచారం చేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన నెల రోజుల్లోనే శిక్ష ఖరారైంది. సూరత్ ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పును వెల్లడించింది.

read more  హైదరాబాద్ లో దారుణం... రోడ్డుపక్కన ఫుట్ పాత్ పైనే ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన ఉత్తర్‌ప్రదేశ్ కి చెందిన అజయ్ నిషాద్ కు life sentence విధిస్తూ స్పెషల్ కోర్టు జడ్జి పీఎస్ కళా తీర్పును వెల్లడించారు. ఈ ఏడాది అక్టోబర్ 12న సచిన్ జీఐడీసీ ఏరియాలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆమెపై Rapeకి పాల్పడ్డాడు. దీంతో అక్టోబర్ 13న నిషాద్ ను పోలీసులు అరెస్ట్ చేసి ట్రయల్ కోర్టులో హాజరుపర్చగా ఇంత తక్కువ వ్యవధిలో తీర్పు ఇచ్చింది. నిందితుడికి కఠినంగా శిక్షించింది. 

 చిన్నారులు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే నిందితులను కఠినంగా శిక్షించేందుకు పలు రాష్ట్రాలు పలు కఠిన చట్టాలు చేస్తున్నాయి. అయితే కొన్ని రాస్ట్రాల్లో చట్టాల అమలను కఠినంగా అమలు చేస్తే ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు నిందితులకు అతి తక్కువ కాలంలోనే శిక్షలను ఖరారు చేస్తే కూడా  భవిష్యత్తులో నేరాలకు పాల్పడేవారు భయపడే అవకాశం ఉందని మహిళా సంఘాలు చెబుతున్నాయి.

 
 

click me!