కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా? తెరాస ప్రభుత్వానికి క్లర్క్ గా పని చేస్తున్నారా?.. ఈటెల జమున..

By SumaBala BukkaFirst Published Dec 7, 2021, 8:53 AM IST
Highlights

జమున హెచరీస్ భూములపై కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విషయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి ఆయనకు ఏమి అధికారం ఉంది?  ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాం.  వాళ్ళు వచ్చి మళ్ళీ సర్వే చేశారు.  వాటికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలి.. అని ఈటెల జమున మండిపడ్డారు.

హైదరాబాద్ :  Jamuna Hatcheries కు సంబంధించిన భూములను ఈటెల రాజేందర్ బలవంతంగా ఆక్రమించుకున్నారని కలెక్టర్ హరీష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఈటెల సతీమణి జమున ఆరోపించారు.  సోమవారం 
Shamir Petaలో ఆమె విలేకరులతో మాట్లాడారు.  మెదక్ జిల్లాలోని అచ్చంపేట, హకీంపేటలలో etela rajender కు చెందిన జమున హెచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు జిల్లా కలెక్టర్ హరీష్ పేర్కొన్న నేపథ్యంలో ఆమె స్పందించారు.

‘జమున హెచరీస్ భూములపై Collector Harish ప్రెస్ మీట్ పెట్టారు. ఈ విషయంలో విలేకరుల సమావేశం పెట్టడానికి ఆయనకు ఏమి అధికారం ఉంది?  ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాం.  వాళ్ళు వచ్చి మళ్ళీ సర్వే చేశారు.  వాటికి సంబంధించిన వివరాలను కోర్టుకు సమర్పించాలి.

‘మీ భూమి ఇదే. ఇంతే ఉంది’ అని కనీసం మాకు ఒక కాఫీ ఇవ్వాలి.  మాకు ఎలాంటి వివరాలు చెప్పలేదు. ఈరోజు నేరుగా విలేకరుల సమావేశం పెట్టి... భూములు ఆక్రమించుకున్నారంటూ కలెక్టర్ ఆరోపిస్తున్నారు. కలెక్టర్ ఏమైనా రాజకీయ నాయకుడా?  TRS Governmentకి క్లర్క్ గా పని చేస్తున్నారా?  ఈ విషయమై ఆయన పై policeలకు ఫిర్యాదు చేస్తాం. ఎలాంటి సమస్యలు లేని భూములే Dharani portalలోకి ఎక్కుతాయని గతంలో సీఎం KCR చెప్పారు.  

2019లో అలాంటి భూములనే మేము కొనుగోలు చేశాం.  మొత్తంగా మాకు ఉన్నదే  8.36 ఎకరాలు.  కలెక్టర్ చెప్పిన 70 ఎకరాలతో మాకు సంబంధం లేదు. 
Aggressionకు సంబంధించిన ఆరోపణలు ఉంటే ఈ రెండేళ్ల ఏం చేశారు?  ఇది ఖచ్చితంగా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల కిందికే వస్తుంది.  రాజకీయంగా ప్రత్యర్థి అయితే, అలాగే ఎదుర్కోవాలి. ఈటెల రాజేందర్ 2004 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ అధికారి కైనా ఫోన్లు చేశారా? అధికారులకు ఫోన్లు చేసి భూములు ఆక్రమించుకున్నారా?  గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారని ఎందుకు చెబుతున్నారు.  మహిళా సాధికారత గురించి మాట్లాడే ఈ ప్రభుత్వం ఒక మహిళా వ్యాపార వేత్త మీద దాడి చేయడం సరైన పద్ధతి కాదు’  అని మండిపడ్డారు.

ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా మోసం చేస్తున్న కిలాడీ లేడి.. అరెస్ట్ చేసిన పోలీసులు

ఇంతకీ కలెక్టర్ ఏమన్నారంటే…
ఈటెల రాజేందర్ భూ ఆక్రమణ ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్  నివేదిక రూపొందించారు.  గత మేలోనే  భూములను సర్వే చేసి నివేదిక సిద్ధం చేయగా.. అధికారులు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఈటల వర్గం హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో ఈటల రాజేందర్ భార్య జమున, కొడుకు నితిన్ రెడ్డిలతో పాటు..  అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన 156 మందికి నోటీసులు జారీ చేశారు.

గత నెల 16వ తేదీ నుంచి సుమారు 15 రోజుల పాటు పున:సర్వే నిర్వహించారు. అచ్చంపేట గ్రామ పరిధిలోని 77, 78, 79, 80, 81, 82, 130, హకీంపేట పరిధిలోని 97, 111 సర్వే నెంబర్లలో  సర్వే నిర్వహించారు. జమున హెచరీస్ అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నట్లు  ఈరోజు ఉదయం కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.  ఈ రెండు గ్రామాల పరిధిలో 70.33 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నట్లు ఆయన తెలిపారు.

దీంతో పాటు జమున హెచరీస్ వివిధ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్టు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు జమున హెచరీస్ వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడిందని తెలిపారు. కోళ్ల వ్యర్థాల వల్ల స్థానికంగా ఉన్న ఎల్కం చెరువు నీరు,  భూగర్భ జలాలు, గాలి కలుషితమైందని.. దుర్వాసన సైతం వస్తోందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు.

అచ్చంపేట గ్రామం లోని  81, 130 సర్వే నెంబర్లలో ఉన్న భూములు నిషేధిత జాబితాలో ఉన్నా.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు కలెక్టర్ హరీశ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తామన్నారు. 
 

click me!