మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దారుణం జరిగింది. పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తి తన ప్రత్యర్థి వేలును కసుక్కున కొరికేశాడు. దీంతో వేలు గోరు వరకు తెగిపడింది.
మేడ్చల్ : పాత కక్షలతో Thumbని కొరికిన ఘటన శామీర్పేట ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం Lalgadi malakpetకు చెందిన చాట్లపల్లి మల్లేష్ (48) డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన చాట్లపల్లి నాగేష్ అలియాస్ కన్న(39) స్థానిక కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. వారి మధ్య గతంలో గొడవలు జరిగాయి.
ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మల్లేష్ కిరాణా దుకాణానికి వెళ్ళాడు. ఆ సమయంలో నాగేష్ అక్కడే ఉన్నాడు. మల్లేష్ ను చూడగానే నాగేష్ గొడవకు దిగాడు. దీంతో కోపంతో మల్లేష్ ఎడమచేతి బొటనవేలును కసుక్కున కొరికాడు. దీంతో సగం వేలు పూర్తిగా తెగిపోయింది. బాధిత కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
undefined
ఇలాంటి ఘటనే మార్చి 19న వరంగల్ లో చోటు చేసుకుంది. ఓ దుర్మార్గుడు.. ఓ మహిళ మీద కన్నేశాడు. పొలాల్లోకి లాక్కెళ్లి.. అత్యాచారయత్నం చేశారు. ఇక, మహిళ గట్టిగా కేకలు వేయడంతో... మహిళను కాపాడేందుకు ఆమె భర్త వెళ్లాడు. దీంతో బాధితురాలి భర్త మీద దాడి చేసిన నిందితుడు.. అతడిని తీవ్రంగా గాయపర్చి, అక్కడి నుంచి పరారయ్యాడు. warangal జిల్లా రాయపర్తి మండలం కొండాపూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే..
కొండాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గ్రామశివారులో Biryani Hotel పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామంలో వీఆర్ఏగా పనిచేస్తున్న అశోక్.. హోటల్ కు వెళ్లి శ్రీనివాస్ భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఆమె కేకలు వేడంతో అది విన్న ఆమె భర్త శ్రీనివాస్.. అశోక్ ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అదే క్రమంలో శ్రీనివాస్ చేతివేలు తెగిపడేలా కొరికిన అశోక్..ఆ తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితుని ఫిర్యాదులో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన మీద మాట్లాడిన బాధితుడు శ్రీనివాస్ కొండాపూర్ గ్రామ శివారులో బిర్యానీ హోటల్ నడుపుతున్నాను.. నిన్న రాత్రి 9 గంటల సమయంలో అశోక్ అనే వ్యక్తి మా హోటల్ కు వచ్చి నా భార్యను పొలాల్లోకి లాక్కొనిపోయాడు. మద్యం మత్తులో నా భార్య మీద అసభ్యంగా ప్రవర్తించారు. నేను అతడిని గళ్లా పట్టుకోగా నా వేలిని పూర్తిగా కొరికి పారిపోయాడు. ఇలాంటివి పునరావృతం కాకుండా.. పోలీసులు అతడినిి జైల్లో పెట్టాలని వేడుకున్నాడు.