బెర్త్ ఖరారైన అభ్యర్థులకు ఫోన్ కాల్స్: హరీష్ ఉన్నా కేసీఆర్ తర్వాత కేటీఆరే

By telugu team  |  First Published Sep 8, 2019, 12:01 PM IST

టీఆర్ఎస్ లో గానీ ప్రభుత్వంలో గానీ కేసీఆర్ తర్వాతి స్థానం తనదేనని కేటీఆర్ మరోసారి రుజువు చేసుకున్నారు. మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసేవారికి కేటీఆర్ స్వయంగా ఫోన్ కాల్స్ చేశారు. దీన్నిబట్టి తనదే పైచేయి అని చాటుకున్నారు.


హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తర్వాతి స్థానం ఆయన తనయుడు కేటీ రామారావుదేనని మరోసారి నిరూపితమైంది. కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న వేళ కేటీఆర్ అంతా తానై చూశారు. కేటీఆర్ మాటనే మంత్రివర్గ విస్తరణలో కూడా చాలా వరకు కేటీఆర్ మాటనే చెల్లుబాటు అయినట్లు తెలుస్తోంది.

కేసీఆర్ ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.  సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ లను కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Latest Videos

undefined

అయితే, మంత్రి పదవులు ఖరారైన అభ్యర్థులకు కేటీఆర్ ఫోన్ కాల్స్ చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ వారికి ఫోన్ కాల్స్ చేసి ఉండవచ్చునని భావించినా కేసీఆర్ తర్వాత స్థానం తానదేనని ఆయన చెప్పకనే చెప్పారని అంటున్నారు. 

హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ కేటీఆరే కేసీఆర్ రాజకీయ వారసుడిగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ మంత్రివర్గ కూర్పును చేసుకున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తిని తొలగించడానికి, నాయకులు జారిపోకుండా ఉండడానికి అవసరమైన రీతిలోనే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది.

సంబంధిత వార్తలు

ఈటలతో నాకు విభేదాలు లేవు: గంగుల

మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ

కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ

నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....

కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే

కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....

click me!