శివరాంపల్లిలో పేలుడు కలకలం: వ్యక్తికి గాయాలు

Published : Sep 08, 2019, 11:26 AM ISTUpdated : Sep 08, 2019, 02:03 PM IST
శివరాంపల్లిలో పేలుడు కలకలం: వ్యక్తికి గాయాలు

సారాంశం

హైద్రాబాద్ లోని శివరాంపల్లిలో పేలుడు సంబవించింది. ఈ పేలుడులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్: హైద్రాబాద్‌ పట్టణంలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలో ఆదివారం నాడు పేలుడు సంబవించింది.ఈ పేలుడు శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు.

పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ 280 నెంబర్ పిల్లర్ వద్ద పేలుడు సంబవించింది. ఓ వ్యక్తి చేతిలోని  డబ్బాలో ఉన్న కెమికల్ వల్ల  పేలుడు సంబవించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. చేతిలోనే డబ్బా పేలిపోవడంతో  ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించినట్లుగా తేలుస్తోంది

ఈ బాక్స్ ను తెరిచిన వ్యక్తి పేరు అలీ అని.. అతను సమీపంలో బిచ్చమెత్తుకుంటూ జీవిస్తాడని పోలీసులు చెబుతున్నారు. దానిని తెరచిన వెంటనే అతని చేతులు ఎగిరిపడ్డట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ బాక్స్ ను అతను ఎక్కడి నుండి తీసుకొచ్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!