కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో స్పష్టత ఇచ్చారు. గంగుల కమలాకర్ కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంత్రి వర్గ విస్తరణలో గంగుల కమలాకర్ కు కేసీఆర్ చోటు కల్పించనున్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయన తెలుగు న్యూస్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆదివారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.ఆరుగురికి కేసీఆర్ తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఆరుగురిలో గంగుల కమలాకర్ కు కూడ చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
undefined
ఈ తరుణంలో ెతులుగ మీడియాఛానెల్స్ కమలాకర్ ను ఇంటర్వ్యూ చేశాయి. మంత్రి పదవి విషయమై ఇటీవల ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించేందుకు కొందరు తన నియోజకవర్గంలో డబ్బులను కూడ పంపినీ చేశారని ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు.ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
తనకు మంత్రి ఈటల రాజేందర్‌కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తనకు కేసీఆర్ మాత్రమే బాస్ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో తాను కీలకంగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రెండు దఫాలు కరీంనగర్ కార్పోరేటర్‌గా పనిచేశానని.. మూడు దఫాలు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు గంగుల కమలాకర్. 2009లో ఉమ్మడి అసెంబ్లీలో టీడీపీ అభ్యర్ధిగా కరీంనగర్ నుండి పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు.2014,2018ఎన్నికల్లో కమలాకర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.బీసీ సామాజిక వర్గం నుండి గంగుల కమలాకర్ కు కేసీఆర్ తన కేబినెట్ లో చోటు కల్పించనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ ఏ బాధ్యతలను తనకు అప్పగించినా కూడ ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నెరవేర్చనున్నట్టు కమలాకర్ చెప్పారు. తనపై నమ్మకం ఉంచి మంత్రివర్గంలోకి తీసుకొంటే కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని ఆయన చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కేసీఆర్ కోరుకొంటారని ఆయన తెలిపారు. కేసీఆర్ తనను మంత్రివర్గంలోకి తీసుకొంటే కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతానని ఆయన చెప్పారు.
తాను కేసీఆర్, కేటీఆర్‌లకు స్లీపర్ సెల్స్ వంటి వాడినని గంగుల కమలాకర్ చెప్పారు. ముఖ్యమంత్రి తనకు భరోసా ఇచ్చారని.... ఆ భరోసాను తాను నిలబెట్టుకొంటానని కమలాకర్ తెలిపారు.
సంబంధిత వార్తలు
మంత్రి పదవిపై తేల్చేశారా: కేసీఆర్‌తో ఈటల రాజేందర్ భేటీ
కేసీఆర్ కేబినెట్ విస్తరణ: ఉద్వాసన ఎవరికీ
నేడే మంత్రివర్గ విస్తరణ: ఆ ఆరుగురు వీరే....
కేసీఆఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు: కొత్తగా నలుగురే
కేసీఆర్ కేబినెట్: కేటీఆర్, హరీష్‌లలో ఎవరికి చోటు?
దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌కు చోటు, కారణమదేనా
సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....