సత్తా చూపుతాం: కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు

By narsimha lodeFirst Published Sep 26, 2018, 12:50 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ సమక్షంలో  కొండా సురేఖ దంపతులు  బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ సమక్షంలో  కొండా సురేఖ దంపతులు  బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కొండా సురేఖకు టీఆర్ఎస్‌కు టిక్కెట్టు కేటాయించకపోవడంతో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం నాడు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడంతో టీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్ తో పాటు,  మంత్రి కేటీఆర్‌పై కూడ కొండా సురేఖ దంపతులు  తీవ్ర విమర్శలు గుప్పించారు.

మంగళవారం నాడు కూడ కొండా సురేఖ టీఆర్‌ఎస్‌పై   విమర్శలు గుప్పించారు. బుధవారం నాడు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు వెంటరాగా  కొండా దంపతులు  రాహుల్ సమక్షంలో చేరారు. కొండా దంపతులతో పాటు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఆయన సతీమణి సుమన్ రాథోడ్ కూడ రాహుల్ ను కలిశారు.

కొండా దంపతుల సత్తా ఏమిటో టీఆర్ఎస్‌ నాయకులకు ఇవాళ్టి నుండే తెలుస్తోందని సురేఖ హెచ్చరించారు.పార్టీని వీడీతే ఎలాంటి నష్టం లేదని టీఆర్ఎస్ నేతలు  చేస్తున్న ప్రచారంలో వాస్తవం త్వరలోనే తేలనుందన్నారు.  వరంగల్ జిల్లాల్లో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లను గెలిపించుకొని వస్తామని రాహుల్ గాంధీకి  వాగ్దానం చేసినట్టు  సురేఖ తెలిపారు.

భేషరతుగా  కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెప్పారు.  తాము రెండు సీట్లు అడిగామని...టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని  సురేఖ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల ప్రకారంగా తాము నడుచుకొంటామని ఆమె తెలిపారు.తాము పార్టీ నాయకత్వం వద్ద ఎలాంటి డిమాండ్లు పెట్టలేదన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కూడ టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అప్పుడు మంచి వాళ్లం...ఇప్పుడు విమర్శలా..కొండా దంపతులకు కేటీఆర్ కౌంటర్

నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

రేపే ముహూర్తం: కొండా సురేఖ గమ్యం ఎటు వైపు?

మూడు సీట్లు ఆఫర్ చేసిన కేసిఆర్: రాజీకి కొండా సురేఖ నో

కేటీఆర్ మనసులో పెట్టుకొనే నాకు టిక్కెట్టు ఆపేశాడు: కొండా సురేఖ

కార్యకర్తలతో భేటీ: 23 వరకు కొండా సురేఖ వెయిట్

జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సు

 

click me!