10 నెలల క్రితం కొడుకు హత్య: అత్తాపూర్ మర్డర్ వెనుక కారణమిదే(వీడియో)

By narsimha lode  |  First Published Sep 26, 2018, 12:43 PM IST

 హైద్రాబాద్ అత్తాపూర్‌లో  బుధవారం నాడు  పట్టపగలే   దారుణ హత్య చోటు చేసుకొంది


హైదరాబాద్: పాతకక్షలను దృష్టిలో ఉంచుకొని హైద్రాబాద్ అత్తాపూర్ వద్ద రమేష్‌గౌడ్  అనే వ్యక్తిని  నలుగురు వ్యక్తులు హత్య చేశారు. పది మాసాల క్రితం మహేష్ గౌడ్ అనే వ్యక్తిని రమేష్ గౌడ్ హత్య చేశారు. ఈ కేసులో రమేష్‌ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు.

మహేష్ హత్య కేసులో నిందితుడుగా ఉన్న రమేష్  ఉప్పర్‌పల్లి కోర్టుకు బుధవారం నాడు హాజరౌతుండగా  మహేష్ తండ్రి  రమేష్‌ను హత్య చేశాడు. చాలా కాలంగా రమేష్ గౌడ్ ఎక్కడికి వెళ్తున్నాడనే విషయాన్ని ఆరా తీసిన మహేష్ గౌడ్ తండ్రి ఈ హత్యకు పాల్పడ్డాడు.

Latest Videos

గత మాసంలో కోర్టు వాయిదాకు వచ్చిన రమేష్ ఏ మార్గం గుండా వెళ్తున్నారనే విషయమై  మహేష్ తండ్రి రెక్కీ నిర్వహించాడు.ఈ రెక్కీ ఆధారంగా ఇవాళ కోర్టు వాయిదా నుండి తిరిగి వెళ్తున్న  రమేష్‌పై మహేష్ తండ్రితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అత్తాపూర్ 143 నెంబర్ పిల్లర్ వద్ద గొడ్డలితో హత్య చేశాడు.

రమేష్‌తో పాటు గతంలో హత్యకు గురైన మహేష్ గౌడ్ కూడ జుమ్మెరాత్ బజార్‌కు చెందినవారు. పది మాసాల క్రితం రమేష్ అనే వ్యక్తి మహేష్ గౌడ్‌ను ముచ్చింతల వధ్ద హత్య చేశాడు. వీరిద్దరి ఇళ్లు పక్క పక్కనే ఉంటాయి.

రమేష్ ను హత్య చేసిన తర్వాత మహేష్ గౌడ్ తండ్రితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడ రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.  మహేష్‌ను హత్య చేసినందుకే రమేష్ ను హత్య చేసినట్టుగా నిందితులు చెప్పినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అత్తాపూర్‌ మర్డర్: వివాహితతో అఫైర్ వల్లనే అప్పుడు మహేష్, ఇప్పుడు రమేష్...

 

"

click me!