ప్రణయ్ హత్య.. కిరాక్ ఆర్పీ ఏమన్నాడంటే..

Published : Sep 26, 2018, 12:35 PM IST
ప్రణయ్ హత్య.. కిరాక్ ఆర్పీ ఏమన్నాడంటే..

సారాంశం

హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్తూ మిర్యాలగూడలోని ప్రణయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. 

ఇటీవల మిర్యాలగూడలో  పరువు హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను ప్రముఖ టీవీ షో  బబర్ధస్త్ టీం లీడర్ కిరాక్ ఆర్పీ కలిశారు. తక్కువ కులస్థుడుని తన కూతురు ప్రేమించిందనే కారణంతో అమృత తండ్రి మారుతీరావు .. అల్లులు ప్రణయ్ ని దారుణంగా హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు రాష్ట్రాలను కుదిపేసింది.

కాగా.. ఈ ఘటనపై కిరాక్ ఆర్పీ స్పందించాడు. కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్‌ను దారుణంగా హత్యచేయించడం ఆటవిక, పిరికిపంద చర్య అని  కిరాక్‌ ఆర్పీ అన్నారు. హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్తూ మిర్యాలగూడలోని ప్రణయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రేమ పెళ్లి చేసుకున్న నూతన దంపతులను హత్యోన్మాదంతో విడదీసిన పాపం ఊరికేపోదన్నారు. మారుతీరావు పరువుకోసం గర్భవతిగా ఉన్న అమృతకు భర్త ప్రేమను దూరం చేసి, తాను కేసులపాలై ఏం సాధించాడని ప్రశ్నించాడు. ఆయనవెంట కులాంతర వివాహాల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జనగామ స్వామి, ప్రదీప్ కుమార్‌ ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌