ప్రకటిస్తారా..మేం ప్రకటించుకోమా:కాంగ్రెస్ కు కోదండరామ్ అల్టిమేటమ్

By Nagaraju TFirst Published Oct 29, 2018, 8:57 PM IST
Highlights

ప్రజాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో మండిపడ్డారు. 
 

హైదరాబాద్: ప్రజాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో మండిపడ్డారు. 

సీట్ల పంపకాలను త్వరగా తేల్చాలని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండటంతో టీజేఎస్ అసహనం వ్యక్తం చేస్తోంది. సోమవారం టీజేఎస్‌ కోర్ కమిటీ సమావేశమైంది. సీట్ల పంపకాలపై అంతర్గత చర్చ జరిగింది. కాంగ్రెస్ సీట్ల పంపకం తేల్చకపోతే 15 స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామని అల్టిమేటమ్ జారీ చేసింది. 

పొత్తులపై తాడోపేడో తేల్చాలని కోదండరాపై టీజేఎస్‌ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కాంగ్రెస్ లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కొద్దిరోజులు వేచి చూద్దామని అప్పటికీ సీట్ల పంపకం ఓ కొలిక్కిరాకపోతే 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిద్దామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కోర్ కమిటీలో స్పష్టం చేసినట్లు సమాచారం.  

ఇకపోతే సీపీఐ సైతం కాంగ్రెస్ పార్టీపై ఒత్తితితెస్తోంది. ఇప్పటికే ఏపార్టీకి ఎన్ని సీట్లు అన్న అంశాలపై ఓ కొలిక్కి వచ్చినా ఏ పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చెయ్యాలన్నదానిపై క్లారిటీ రావడంల లేదు. ఇప్పటికే హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, వైరా, మునుగోడు, దేవరకొండ స్థానాలపై సీపీఐ ఆశలు పెట్టుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్య పార్టీల ఒత్తిడిని ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. 

ఈ వార్తలు కూడా చదవండి

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దు

click me!