తెలుగుదేశంలోకి బుడాన్ బేగ్.. ఖమ్మంలో టీఆర్ఎస్‌‌కు కష్టమే..!!

sivanagaprasad kodati |  
Published : Nov 26, 2018, 11:50 AM IST
తెలుగుదేశంలోకి బుడాన్ బేగ్.. ఖమ్మంలో టీఆర్ఎస్‌‌కు కష్టమే..!!

సారాంశం

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ షేక్ ఆ పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ ఖమ్మంలో భారీ స్థాయిలో జరుగుతోంది. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టేశారు బుడాన్ బేగ్. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన మొగ్గుచూపారు

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బుడాన్ బేగ్ షేక్ ఆ పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరుతారనే చర్చ ఖమ్మంలో భారీ స్థాయిలో జరుగుతోంది. ఇలాంటి వార్తలకు చెక్ పెట్టేశారు బుడాన్ బేగ్.

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన మొగ్గుచూపారు. ఈ నెల 28న ఖమ్మం వేదికగా జరిగే భారీ బహిరంగ సభలో ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకోనున్నారు.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకనేతగా ఉన్న బేగ్ ప్రస్తుతం ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా వ్యవహారిస్తున్నారు. ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోవడంతో పాటు మరికొన్ని విషయాల్లో హైకమాండ్‌పై అసంతృప్తిగా ఉన్న బుడాన్ బేగ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.

ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి పట్టుంది. ఈ నేపథ్యంలో బేగ్‌ను బుజ్జగించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. 
 

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్.. పార్టీని వీడనున్న బుడాన్ బేగ్

టీఆర్ఎస్‌కు షాక్...కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జి రాజీనామా

రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్‌కు షాక్: తండ్రీ కొడుకుల రాజకీయం

టీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ రాములు నాయక్

టీఆర్ఎస్‌కు షాక్...కాంగ్రెస్ గూటికి 30 మంది ఎంపిటీసిలు

కేసీఆర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు షాక్ : కాంగ్రెస్‌లో చేరిన ఎంపిపి, ఎంపిటిసిలు

సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్‌కు షాక్....తాజా మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్థులు

టీఆర్ఎస్‌కు షాక్: ఉత్తమ్‌తో కేఎస్ రత్నం మంతనాలు, త్వరలోనే కాంగ్రెస్‌లోకి

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu