బాబు, రాహుల్ నవ్వులు: ఖమ్మం సభలో ఆసక్తికర సన్నివేశం

By narsimha lodeFirst Published Nov 28, 2018, 3:25 PM IST
Highlights

ఖమ్మంలో పీపుల్స్ ఫ్రంట్‌ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, టీడీపీ చీఫ్ రాహుల్ గాంధీల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది

ఖమ్మం: ఖమ్మంలో పీపుల్స్ ఫ్రంట్‌ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, టీడీపీ చీఫ్ రాహుల్ గాంధీల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది.వీరిద్దరూ నవ్వుతూ  ప్రజలకు పదే పదే అభివాదం చేశారు.

ఖమ్మంలో పీపుల్స్ ఫ్రంట్ నిర్వహించిన ఎన్నికల సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, ప్రజా యుద్దనౌక గద్దర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు టీడీపీ, కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐలు పీపుల్స్ ఫ్రంట్ గా ఏర్పడ్డాయి.  ఈ కూటమి ఉమ్మడి ఎన్నికల ప్రచారసభ ఖమ్మంలో బుధవారం నాడు జరిగింది.

ఈ వేదికపై అతిరథ మహరథులు పాల్గొన్నారు. టీఆర్ఎస్‌ వ్యతిరేక  పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తో కలిసి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కలిసి వేదికను పంచుకోవడం  ఇదే ప్రథమం.

గతంలో కర్ణాటక సీఎం హెచ్ డీ కుమారస్వామి  ప్రమాణ స్వీకారోత్సవంలో  బీజేపీయేతర పార్టీలతో కలిసి చంద్రబాబునాయుడు కూడ ఆ సభలో పాల్గొన్నారు. కానీ, ఆ సభలో రాహుల్‌ను బాబు భుజం తట్టారు.

బీజేపీయేతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ‌తో కలిసి ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.ఇందులో భాగంగానే  రాహుల్ తో కలిసి బాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. వీరిద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఇదే ప్రథమం. 

తొలుత చంద్రబాబునాయుడు కాన్వాయ్ సభ ప్రాంగణానికి చేరుకొంది. ఆ తర్వాత రాహుల్ కాన్వాయ్ సభకు చేరుకొంది. అంతకుముందే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, గద్దర్ లు సభా వేదికపై ఉన్నారు.

వేదికపై బాబు రాహుల్ లు ఛలోక్తులు వేసుకొంటూ నవ్వుకొన్నారు. అంతకుముందు ఖమ్మం జిల్లాలోని పీపుల్స్ ఫ్రంట్ కు చెందిన అభ్యర్థులు బాబు, రాహుల్ మధ్య నిలబడి ఫోటోలు దిగారు.రాహుల్, చంద్రబాబునాయుడులు ప్రజలకు పదే పదే అభివాదం చేశారు. 

సంబంధిత వార్తలు

ఖమ్మంకు బయలుదేరిన బాబు: రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

ఖమ్మం నుండి బాబు, రాహుల్ ఎన్నికల ప్రచారం

రంగంలోకి బాబు: రాహుల్‌తో పాటు తెలంగాణలో ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

click me!