తెలంగాణలో ఏపార్టీతోనూ పొత్తు లేదు: బీఎస్పీ అధినేత్రి మాయావతి

Published : Nov 28, 2018, 02:53 PM IST
తెలంగాణలో ఏపార్టీతోనూ పొత్తు లేదు: బీఎస్పీ అధినేత్రి మాయావతి

సారాంశం

తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ 100 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లాలో పర్యటించిన మాయావతి తెలంగాణలో ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదన్నారు. 

నిర్మల్: తెలంగాణ ఎన్నికల్లో బీఎస్పీ 100 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లాలో పర్యటించిన మాయావతి తెలంగాణలో ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదన్నారు. 

తెలంగాణలో బడుగులు బలహీన వర్గాలు ఏమాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. అటు దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అవినీతి విపరీతంగా జరుగుతోందన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. 

కాన్సీరామ్ కన్న కలలు నిజం చేద్దామని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. పేదలు బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే అది బీఎస్పీతోనే సాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీకి ఓటెయ్యాలని కోరారు.  ప్రజలు గమనించి బీజేపీకి, టీఆర్ఎస్ కు ఓటేయోద్దని మాయావతి పిలుపునిచ్చారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం