ఆ సామాజిక వర్గానికి కేబినెట్లో కేసీఆర్ పెద్దపీట

By narsimha lodeFirst Published Feb 19, 2019, 12:20 PM IST
Highlights

 కేసీఆర్ తన కేబినెట్‌లో ఆరుగురు ఓసీలకు చోటు కల్పించారు. ముగ్గురు బీసీలకు , ఓ ఎస్సీ సామాజిక వర్గానికి బెర్త్ ఇచ్చారు

హైదరాబాద్: కేసీఆర్ తన కేబినెట్‌లో ఆరుగురు ఓసీలకు చోటు కల్పించారు. ముగ్గురు బీసీలకు , ఓ ఎస్సీ సామాజిక వర్గానికి బెర్త్ ఇచ్చారు. మంగళవారం నాడు కేసీఆర్ కేబినెట్ లో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ 10 మందిని మంత్రులుగా ప్రమాణం చేయించారు. కేసీఆర్ ఆరుగురు ఓసీలకు తన కేబినెట్ లో బెర్త్ కల్పించారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.

మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డిలకు కేసీఆర్ తన కేబినెట్ లో చోటు కల్పించారు. ఈ ఐదుగురు కూడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. రెడ్డి సామాజికవర్గానికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారనే చెప్పేందుకే ఈ ఐదుగురికి చోటు కల్పించినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరో వైపు ముగ్గురు బీసీలకు కూడ చోటు కల్పించారు. ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లకు చోటు కల్పించారు. ఎస్సీ సామాజిక వర్గానికి కేసీఆర్ తన కేబినెట్ లో చోటు కల్పించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కొప్పుల ఈశ్వర్ కు చోటు కల్పించారు.

ఇప్పటికే కేసీఆర్ కేబినెట్ లో మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీ ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ లో ఇంకా ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది. గిరిజనులు, మహిళలకు చోటు దక్కే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

సంబంధిత వార్తలు

నవ్వుతూ రాజ్ భవన్‌కు: కేటీఆర్ పక్కనే హరీష్

ఆ ఇద్దరికీ తొలిసారే మంత్రి పదవులు

కేసీఆర్ కేబినెట్: ఆ రెండు జిల్లాలకు విస్తరణలో దక్కని చోటు

కేసీఆర్ వ్యూహం: హరీష్‌కు కేబినెట్‌లో దక్కని అవకాశం

click me!