అనవసర రాద్ధాంతం: మంత్రి పదవి రాకపోవడంపై హరీశ్ స్పందన

By Siva KodatiFirst Published Feb 19, 2019, 12:07 PM IST
Highlights

కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. కేసీఆర్ ఎంతో శ్రమించి టీఆర్ఎస్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. బంగారు తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్‌కు కొత్త మంత్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ పార్టీలో తానొక క్రమశిక్షణ కలిగిన సైనికుడు లాంటి కార్యకర్తనన్నారు. పార్టీ, కేసీఆర్ ఏది ఆదేశిస్తే దానిని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పానని హరీశ్ రావు స్పష్టం చేశారు.

ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ కేబినెట్ కూర్పు చేశారన్నారు. తనకు సీఎం ఎలాంటి బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని హరీశ్ రావు వెల్లడించారు. మంత్రి పదవి రాకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, దీనిపై సోషల్ మీడియాలో ఎలాంటి దుష్ప్రచారం చేస్తే సహించనని ఆయన స్పష్టం చేశారు.

తనపై ఎలాంటి గ్రూప్స్ కానీ, హరీశ్ సేన వంటివి లేవని, ఎవరైనా ఈ తరహా చర్యలకు పాల్పడితే ఎవ్వరూ సీరియస్‌గా తీసుకోవద్దని టీఆర్ఎస్ శ్రేణులకు హరీశ్ రావు సూచించారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం, కేసీఆర్ కోసం పనిచేయాలని హరీశ్ పిలుపునిచ్చారు. 

click me!