కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటా.. ఇంద్రకరణ్ రెడ్డి

Published : Feb 19, 2019, 12:18 PM IST
కేసీఆర్ ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటా.. ఇంద్రకరణ్ రెడ్డి

సారాంశం

కేసీఆర్ చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచామని ఎమ్మెల్యే ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ చేసిన ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచామని ఎమ్మెల్యే ఇంద్ర కరణ్ రెడ్డి తెలిపారు. ఈ రోజు రాజ్ భవన్ లో తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మంత్రి వర్గ విస్తరణలో ఇంద్రకరణ్ కి కేసీఆర్ చోటు కల్పించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించామని ఆయన అన్నారు. తనకు  మరోసారి మంత్రి గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలుతెలిపారు. సీఎం ప్రజలకి ఇంకా చాలా చేయాలని అనుకుంటున్నారని చెప్పారు. కోటి ఎకరాలకు నీరు అంధించాలనేది కేసీఆర్ సంకల్పమని... బంగారు తెలంగాణ సాకారం కోసం సీఎం పనిచేస్తున్నారని చెప్పారు.

తనను గెలిపించిన నిర్మల్ ప్రజలకి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా బాగా పని చేయాలనే ఉద్దేశ్యంతో సీఎం మరోసారి అవకాశం ఇచ్చారన్నారు .  తనకు ఏ పోర్ట్ పోలియో అనేది సీఎం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు.  ఏ బాధ్యత ఇచ్చిన తీసుకుంటానని...సీఎం ఆలోచనల మేరకు నడుచుకుంటానన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!