దిశ గ్యాంగ్‌రేప్, హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. సేకరించిన ఆధారాలను సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు.
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలను సిట్ బృందం షాద్‌నగర్ కోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించారు. ఈ సాక్ష్యాలు నిందితులకు శిక్ష పడేలా దోహదం చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read:justice for disha:12 మందితో సిట్ ఏర్పాటు
undefined
గత నెల 27వ తేదీన దిశను నిందితులు గ్యాంగ్‌రేప్ కు పాల్పడి హత్య చేశారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో దొరికిన కొన్ని వస్తువులను పోలీసులు కోర్టకు సమర్పించారు.
Also read:Justice for Disha:ఆ సాక్ష్యమే కీలకం
దిశకు సంబంధించిన సేకరించిన వస్తువులను పోలీసులు సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. దిశకు సంబంధించి డెబిట్ కార్డు, పర్స్, చున్నీ, ఐడీకార్డు, లో దుస్తులు, జీన్ ప్యాంట్, చెప్పులను పోలీసులు సేకరించారు.
Also read:justice for Disha:జైలులో ఆ నలుగురిపై నిఘా
దిశ లో దుస్తులను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితులు ఉపయోగించిన లారీని క్లూస్ టీమ్ పరిశీలించింది. లారీలో రక్తం మరకలను పోలీసులు సేకరించారు. లారీ క్యాబిన్ లో దిశను తీసుకెళ్లినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ మేరకు కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు.
Also readJustice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు
ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం కేసును విచారణ చేస్తోంది. సిట్ బృందంలో సుమారు 50 మంది పోలీసులు ఉంటారు. ఒక్కో బృందం ఒక్కో అంశానికి సంబంధించి కీలకమైన అంశాలను పరిశోధించనుంది. లారీ యజమానిని కూడ పోలీసులు తమ అదుపులోకి తీసుకొన్నారు.