దిశ ఇష్యూలో వ్యాఖ్యలు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు కేసు

Published : Dec 05, 2019, 08:23 AM ISTUpdated : Dec 05, 2019, 08:25 AM IST
దిశ ఇష్యూలో వ్యాఖ్యలు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పోలీసు కేసు

సారాంశం

నవంబర్ 28న హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ మీద నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం షాద్‌నగర్ వద్ద ఆమెను దహనం చేశారు. 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి చుక్కెదురైంది.  ఆయనపై పోలీసు కేసు నమోదైంది. రాజాసింగ్‌పై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో ‘దిశ’పై అత్యాచారం, హత్య సందర్భంగా రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ, తమ మతాన్ని కించపరిచారంటూ ఓ మహమ్మద్ నవాజుద్దీన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

దీంతో పోలీసులు రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నవంబర్ 28న హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ మీద నలుగురు యువకులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం షాద్‌నగర్ వద్ద ఆమెను దహనం చేశారు. 

ఈ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటనపై స్పందించిన రాజాసింగ్ నిందితుల్లో ఒకరైన మహ్మద్ ఆరిఫ్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలోనే.. ఓ వ్యక్తి రాజాసింగ్ కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాడు.

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే