దిశ హత్య కేసులో విచారణ కోసం పోలీసులు సిట్ ఏర్పాటు చేశారు. సిట్ విాచరణను సీపీ సజ్జనార్ పర్యవేక్షించనున్నారు.
హైదరాబాద్: దిశ గ్యాంగ్‌రేప్, హత్య కేసును విచారించేందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ సిట్‌కు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు.ఈ కేసును సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షించనున్నారు.
Also read:Justice for Disha:ఆ సాక్ష్యమే కీలకం
undefined
గత నెల 27వ తేదీన శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు తొండుపల్లి వద్ద దిశపై గ్యాంగ్‌రేప్, హత్యకు పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించి శాస్త్రీయమైన ఆధారాలను సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also read:justice for Disha:జైలులో ఆ నలుగురిపై నిఘా
దిశ గ్యాంగ్‌రేప్, హత్య కేసుకు సంబంధించి 12 మందితో సిట్‌ను ఏర్పాటు చేశారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈ సిట్‌లో నలుగురు అడిషనల్ డీసీపీలు, ముగ్గురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు సభ్యులుగా ఉంటారు.
సిట్‌లోని 12 మంది సభ్యులు నాలుగు టీమ్‌లుగా విడిపోయి కేసును దర్యాప్తు చేయనున్నారు. ఈ కేసును త్వరగా తేల్చాలనే ఉద్దేశ్యంతో పోలీసులు టీమ్‌లుగా విడిపోయి విచారణ చేయనున్నారు.
Also readJustice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు
సిట్ బృందంలోని ఒక్కొక్క టీమ్ ఒక్కో విభాగంలో సాక్ష్యాలను సేకరించనున్నారు. ఒక్క టీమ్ శాస్త్రీయమైన ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపే పనిని చూస్తోంది. మరో టీమ్ నిందితులు ఏ సమయంలో ఎక్కడ ఉన్నారనే విషయమై సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచారాన్ని సేకరించనున్నారు.
మరో టీమ్ సీసీటీవీ పుటేజీల దృశ్యాలను సేకరించనుంది. ఈ టీమ్‌లన్నీ కూడ తాము సేకరించిన ఆధారాలను డీసీపీ ప్రకాష్ రెడ్డికి అందించనున్నారు. ప్రకాష్ రెడ్డి ఈ కేసులో చార్జీషీట్‌ను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దాఖలు చేయనున్నారు. ఈ కేసును సైబరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షించనున్నారు.