మైనర్ బాలికను అతనే ట్రాప్ చేశాడు: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

By narsimha lode  |  First Published Jun 9, 2022, 5:27 PM IST

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల నుండి కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. మాజీ ఎమ్మెల్యే మనమడు, ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు కనుగొన్నారని  తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 


హైదరాబాద్: హైద్రాబాద్ Jubilee Hills  గ్యాంగ్ రేప్ కేసులో  నిందితుల నుండి కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. 
మాజీ ఎమ్మెల్యే మనమడు, ఎమ్మెల్యే కొడుకు Remand Report రిపోర్టులో సంచలన విషయాలను పోలీసులు కనుగొన్నారు. కార్పోరేటర్ కొడుకే మైనర్ బాలికను ట్రాప్ చేసినట్టుగా నిందితులు చెప్పారని  రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నట్టుగా ఎన్టీవీ చానెల్ కథనం ప్రసారం చేసింది.

Amnesia Pub పబ్ లో బాలికతో కార్పోరేటర్ కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడని ఆ చానెల్ కథనం తెలిపింది.  పబ్ బయట కూడా కార్పోరేటర్ కుమారుడు మాయమాటలు చెప్పి బాలికను కారులో ఎక్కించారని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తొలుత బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే కుమారుడే బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నారు. 

Latest Videos

undefined

కాన్సూ బేకరి దగ్గరికి వెళ్లే సరికి ముందు సీట్లో నుండి సాదుద్దీన్ వెనుక  సీట్లోకి మారాడని నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారని ఎన్టీవీ చానెల్  తెలిపింది.  minor బాలికపై  సాదుద్దీన్ లైంగిక దాడి చేశాడని నిందితులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని న్యూస్ చానెల్ కథనం వివరించింది. 

కాన్సూ బేకరి వద్ద బాలికను కార్లో కూర్చోబెట్టిన తర్వాత  బేకరీలో స్నాక్న్, సిగరెట్లు తాగారని రిమాండ్ రిపోర్టు తెలిపిందని  న్యూస్ చానెల్ ప్రసారం చేసింది.  బాలిక సెల్ ఫోన్, కళ్లద్దాలు బలవంతంగా లాక్కున్నామని రిమాండ్ రిపోర్టు తెలిపింది. అద్దాలు, సెల్ ఫోన్ కావాలంటే ఇన్నోవా కారులో ఎక్కాలని బెదిరింపులకు పాల్పడినట్టుగా నిందితులు చెప్పారని రిమాండ్ రిపోర్టులో వివరించినట్టుగా తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది.  కారులోనే ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడినట్టుగా నిందితులు ఒప్పుకొన్నారని ఆ రిపోర్టు తెలిపిందని న్యూస్ చానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. 

also read:amnesia pub rape case: మైనర్లను కస్టడీకి అనుమతించిన కోర్ట్.. నాలుగు రోజుల పాటు పోలీసుల అదుపులోనే

ఈ ఏడాది మే 28వ తేదీన Amnesia Pub లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.
 

click me!