జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై కోర్టులో ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్: Jubilee hills గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను వారం రోజుల పాటు Custody కి ఇవ్వాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టులో Petition దాఖలు చేశారు. మంగళవారం నాడు ఈ పిటిషన్ పై Court విచారణ చేసే అవకాశం ఉంది.ఈ కేసులో ఐదుగురు నిందితులున్నారని పోలీసులు ప్రకటించారు. వీరిలో నలుగురిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఒకరు మినహా మిగిలిన ముగ్గురు మైనర్లేనని పోలీసులు వివరించారు.పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాలిక నుండి ఈ కేసు విచారణ అధికారి ACP Sudarshan జ్యుడిషీయల్ అధికారుల సమక్షంలో ఈ నెల 6వ తేదీన స్టేట్ మెంట్ రికార్డు చేశాడు. బాలిక నుండి రెండో సారి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. బాలికతో పాటు వారి కుటుంబ సభ్యుల నుండి కూడా పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు.
ఈ ఏడాది మే 28వ తేదీన Amnesia పబ్ లో గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు.
undefined
అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని Telangana రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.
also read:ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదు: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది. తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.
నిందితులు ఉపయోగించిన కార్లలో కూడా పోలీసుటు టెక్నికల్ ఎవిడె్న్స్ ను సేకరించారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును రెండు రోజుల క్రితం పోలీసులు సీజ్ చేశారు. అంతకు ముందే బెంజీ కారును కూడా పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే.