అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై పవన్ కళ్యాణ్

By narsimha lode  |  First Published Jun 6, 2022, 4:46 PM IST

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ స్పందించారు.అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారు. బాాధితురాలని ఆదుకోవాలని కూడా ఆయన కోరారు. 


హైదరాబాద్:  అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. Hyderabad జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై Pawan Kalyanస్పందించారు.

హైద్రాబాద్ Amnesia పబ్  నుండి మైనర్ బాలికను తీసుకెళ్లి  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. Jubilee hills ఘటనపై ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ ఘటనపై Jana Sena చీఫ్  స్పందించారు.  సామాూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన  కోరారు. నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలోనూ తరచూ ఈ తరహా ఘోరాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Latest Videos

undefined

ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో  గెట్ టూ గెదర్ పార్టీకి మైనర్ బాలిక హాజరైంది. ఈ పార్టీ ముగిసిన తర్వాత  బాలికను ఇంటి వద్ద దింపుతామని చెప్పి కారులో తీసుకెళ్లిన నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. 

అయితే బాలిక తండ్రి ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకొంటుంది. అయితే  ఆసుపత్రిలో ఉన్న బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్  తీసుకున్నారు.తనపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు బాలిక వివరించింది. మరో సారి బాలిక నుండి పోలీసులు స్టేట్ మెంట్ ను తీసుకొనే అవకాశం ఉంది.ఈ కేసు విషయమై ప్రభుత్వం తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఈ కేసులో నిందితులు ప్రజా ప్రతినిధుల పిల్లలు కావడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వం తోసిపుచ్చింది. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు లేవని చెప్పారు.

also read:హైద్రాబాద్‌లో బీజేపీ కార్యాలయం ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం, ఉద్రిక్తత: లాఠీచార్జీ చేసిన పోలీసులు

కారులోనే మైనర్ బాలికపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాదితురాలిని నిందితులు పబ్ వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత బాలిక ఇంటికి వెళ్లింది.  తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పింది.ఈ విషయమై బాలిక తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి.

ఈ కేసులో  ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఉపయోగించిన కార్లలో కూడా పోలీసుటు టెక్నికల్ ఎవిడె్న్స్ ను సేకరించారు. నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును రెండు రోజుల క్రితం పోలీసులు సీజ్ చేశారు. అంతకు ముందే బెంజీ కారును కూడా పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. 

click me!