ఈ చెప్పుతో నన్ను కొట్టండి.. ప్రజలను కోరిన అభ్యర్థి (వీడియో)

Nov 23, 2018, 2:58 PM IST

ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్నంగా ప్రచారం చేపడుతున్నాడు. రాజీనామా పత్రాలు, చెప్పులు వెంటపట్టుకొని ఇంటింటికీ తిరుగుతున్నారు. ఆయనే జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ  నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల హన్మాండ్లు.

తనను గెలిపించాలని కోరుతూనే.. గెలిచాక.. హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలో కూడా ఆయన ప్రజలకు వివరిస్తున్నారు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తనను చెప్పుతో కొట్టి మరీ పని చేయించుకోవాలంటూ ఓటర్లకు ఆకుల హన్మాండ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. అందుకే ఇంటింటికీ తిరుగుతూ కరపత్రం, రాజీనామా పత్రంతో పాటు చెప్పులు కూడా పంచుతున్నారు.