రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

Published : Sep 28, 2018, 11:00 AM ISTUpdated : Sep 28, 2018, 12:43 PM IST
రేవంత్ భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి ఆరా తీస్తున్న ఐటీ అధికారులు

సారాంశం

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య గీత‌ను ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భార్య గీత‌ను ఐటీ అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. గీత సమక్షంలోనే అధికారులు  ఆర్థిక లావాదేవీలపై  ఆరా తీస్తున్నారు.

రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లపై  ఐటీ అధికారులు గురువారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు కూడ సోదాలు కొనసాగుతున్నాయి.

ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సమాచారం తెలుసుకొన్న రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి కొడంగల్ ‌లో ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి హైద్రాబాద్‌కు వచ్చారు.

గురువారం రాత్రి నుండి ఐటీ అధికారులు ఈ విషయమై రేవంత్ తో పాటు ఆయన కుటుంబసభ్యులను  పలు విషయాలపై ఆరా తీస్తున్నారు.ఇదిలా ఉంటే శుక్రవారం నాడు రేవంత్ రెడ్డి సతీమణి గీత సమక్షంలో ఐటీ అధికారులు బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

గీతకు ఉన్న బ్యాంకు అకౌంట్లలో ఉన్న లాకర్లు... నగదు తదితర విషయాలపై ఐటీ అధికారులు గీత వద్ద సమాచారాన్ని రాబడుతున్నారని సమాచారం.ఎక్కడి నుండి నిధులు వచ్చాయనే విషయాలపై  ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

24 గంటలుగా సోదాలు.. రాత్రంతా రేవంత్‌పై ప్రశ్నల వర్షం

రేవంత్ రెడ్డి లావాదేవీల చిట్టా ఇదే: గుట్టు విప్పిన న్యాయవాది

రేవంత్‌రెడ్డి చుట్టూ ఉచ్చు: వేయికోట్ల దాకా అక్రమార్జన?

అప్పుడు నా కూతురి లగ్న పత్రిక రోజే...ఇప్పుడు మళ్లీ : రేవంత్ ఆవేదన

జైలు నుంచే నామినేషన్ వేస్తా.. రేవంత్ రెడ్డి

కొడంగల్ కార్యకర్తల వద్ద భావోద్వేగానికి గురైన రేవంత్

తాళాలు పగలకొట్టి మరీ రేవంత్ ఇంట్లోకి అధికారులు

రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటి దాడులు: వేలు కేసిఆర్ వైపే...


 

PREV
click me!

Recommended Stories

Hyderabad Holi Celebrations 2026 at Tank Bund: హైదరాబాద్‌లో ఘనంగా హోలీ సంబరాలు| Asianet News Telugu
Ayatollah Ali Khamenei: ఖమేనీకి మద్దతుగా హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ| Asianet News Telugu