పాతబస్తీలో పోలీసు స్టేషన్ పై 30 మంది గంజాయి వ్యాపారుల దాడి

By pratap reddyFirst Published Sep 28, 2018, 10:58 AM IST
Highlights

అక్రమంగా గంజాయి కలిగి ఉన్నారనే ఆరోపణపై ఆబ్కారీ పోలీసులు బుధవారంనాడు ఆర్తి బాయ్ అనే మహిళను, ఆమె కుమారుడు ఉదయ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకుని ధూల్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు.

హైదరాబాద్: అక్రమ గంజాయి వ్యాపారం చేస్తున్న 30 మంది హైదరాబాదులోని పాతబస్తీలో గల ధూల్ పేట పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. నార్కోటిక్ కలిగి ఉన్నారనే ఆరోపణపై అరెస్టు చేసిన ఇద్దరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. 

ఆ ఘర్షణలో ధూల్ పేట ఇన్ స్పెక్టర్ గంగాధర్, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ నవీన్ కుమార్ గాయపడ్డారు. అక్రమంగా గంజాయి కలిగి ఉన్నారనే ఆరోపణపై ఆబ్కారీ పోలీసులు బుధవారంనాడు ఆర్తి బాయ్ అనే మహిళను, ఆమె కుమారుడు ఉదయ్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. 

బుధవారం రాత్రి వారిని అదుపులోకి తీసుకుని ధూల్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. అంగూరి బాయ్, సురేందర్ సింగ్ నాయకత్వంలో 30 మంది గుంపుగా వచ్చి పోలీసు స్టేషన్ పై దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

click me!