వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య కేసు: నిందితులు వెనక్కి వచ్చి చూసి....

By telugu teamFirst Published Dec 2, 2019, 11:28 AM IST
Highlights

వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారం చేసి, ఆమెను చంపిన తర్వాత శవాన్ని పడేయడానికి నిందితులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారిపై అనువైన ప్రదేశాల కోసం వెతుకుతూ చివరకు ఓ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ పై అత్యాచారం చేసి, హత్య చేసిన తర్వాత నిందితులు శవాన్ని తరలించడానికి పక్కా ప్లాన్ వేసుకున్నట్లు అర్థమవుతోంది. శవాన్ని పడేయడానికి శంషాబాద్, షాద్ నగర్ మధ్య జాతీయ రహదారిపై గల వివిధ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. చివరకు చట్టన్ పల్లి గ్రామం వద్ద గల అండర్ పాస్ లో శవాన్ని పడేసి, కాల్చేశారు. 

శవాన్ని తరలించే సమయంలో ఇద్దరు వైద్యురాలి స్కూటీపై ప్రయాణించగా, మరో ఇద్దరు శవాన్ని వేసుకుని ట్రక్కులో వారిని అనుసరించారు. స్కూటీపై ప్రయాణించిన నిందితులు రెండు, మూడు ప్రాంతాలను పరిశీలించినట్లు, అయితే, జనం కనిపించడంతో ఆ ప్రదేశాలు సరైనవి కావని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

Also Read: తెలంగాణ నిర్భయ... కీలకంగా లారీ యజమాని సాక్ష్యం, ఉరిశిక్ష ఖాయం?

చివరకు జాతీయ రహదారిపై గల ఫ్లై ఓవర్ అండర్ పాస్ వారికి సరైన ప్రదేశంగా కనిపించినట్లు తెలుస్తోంది. నర సంచారం లేకపోవడంతో శవాన్ని అక్కడ పడేసి కాల్చేసినట్లు తెలుస్తోంది. శవానికి నిప్పు పెట్టిన తర్వాత వెళ్లిపోయిన నిందితులు తిరిగి వచ్చి శవం పూర్తిగా కాలిపోయిందా లేదా అని చూసి వెళ్లినట్లు తెలుస్తోంది. 

సీన్ రికన్ స్ట్రక్షన్ కోసం డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ కొంత మంది అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం సంఘటనా స్థలానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఓ డీజీపీ సంఘటనా స్థలానికి వెళ్లడం ఇదే మొదటిసారి. 

Also Read: చర్లపల్లి జైల్లో దిశ హత్యకేసు నిందితులు: తొలి రోజే మటన్ తో భోజనం

అదృశ్యమైనట్లు భావించిన వెటర్నరీ డాక్టర్ దిశ సెల్ ఫోన్ ను పోలీసులు చివరకు కనిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని వారు బయటపెట్టడం లేదు. ఫోన్ కాల్స్ ను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించిన వీడియోలు తీసిన దాఖలాలు లేవని అంటున్నారు  

click me!