Hyderabad: ఒక రౌడీ షీటర్.. రూ. 100 కోట్ల ఆస్తి ఎలా కూడబెట్టాడు? ఈడీ దర్యాప్తు

By Mahesh K  |  First Published Dec 8, 2023, 3:43 AM IST

హైదరాబాద్‌లో ఓ రౌడీ షీటర్.. రూ. 100 కోట్ల సంపాదనను కూడబెట్టుకున్నాడు. ఆయన నేర కార్యకలాపాలు చూసిన హైదరాబాద్ పోలీసులు ఈ కేసును ఈడీకి సూచించారు. ఈడీ ఈసీఐఆర్ ఫైల్ చేసింది. దర్యాప్తు చేయనుంది.
 


హైదరాబాద్: అతనో పెహెల్వాన్, ఓ రౌడీ షీటర్. కానీ, ఊహించని స్థాయిలో ఆస్తులు కూడబెట్టుకున్నాడు. రూ. 100 కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. ఆయన నేర కార్యకలాపాలు గమనించి హైదరాబాద్ పోలీసులు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను దర్యాప్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో ఈడీ ఈసీఐఆర్ ఫైల్ చేసింది. దర్యాప్తు చేయనుంది.

హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్‌కు చెందిన ఖైజర్ పెహెల్వాన్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా దర్యాప్తు చేశారు. చాలా క్రిమినల్ కేసుల్లో ఖైజర్ హస్తం ఉన్నట్టు గుర్తించాడు. అక్రమ మార్గంలోనూ భారీగా ఆస్తులను కూడబెట్టుకున్నాడనీ పోలీసులు గుర్తించారు.

Latest Videos

undefined

అక్టోబర్ 26వ తేదీన పోలీసులు కేసు ఫైల్ చేసి ఖైజర్‌ను అరెస్టు చేశారు. అనేక క్రిమినల్ కేసుల్లో ఉన్న ఖైజర్ ప్రత్యేకంగా ఒక గ్యాంగ్‌ను నడుపుతున్నాడు. ఖైజర్‌ను పీడీ యాక్ట్ కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఖైజర్ తొలుత జేబు దొంగ. పిక్ పాకెటింగ్ తో తన నేర కార్యకలాపాలను ప్రారంభించాడు. ఆ తర్వాత దొంగతనాలు చేశాడు. ఆ తర్వాత 1995లో నాంపల్లిలోని ఓ తెల్లకల్లు కాంపౌండ్‌లో అఫ్జల్ అనే వ్యక్తిని వ్యక్తిగత కక్షలతో చంపేశాడు.

Also Read: Liquor Ban: మద్యపానంపై నిషేధాన్ని బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఎత్తేసింది? 30 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో సంచలనం

జైలు నుంచి బెయిల్ పై వచ్చాక ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అమాయక ప్రజలను బెదిరించడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు భూ కబ్జా, ఎక్స్‌టార్షన్ వంటి నేరాల అభియోగాలతో 22 కేసులు ఖైజర్ పై ఉన్నాయి. ఈ అక్రమ పనులతో సుమారు రూ. 100 కోట్ల ఆస్తిని కూడబెట్టుకున్నాడు. ఖైజర్ ఆస్తుల్లో ఇళ్లు, రిసార్ట్‌లు, హోటళ్లు వంటివి ఉన్నాయి. 

ఖైజర్ నేర చరితను దృష్టిలో పెట్టుకుని 2011లో ఆయనను నగర బహిష్కరణ చేయాలని ఆదేశించారు. ఏడాది గడిచిన తర్వాత ఖైజర్ తిరిగి హైదరాబాద్ వచ్చాడు. మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించాడు. ఈ కారణంగానే 2014లో పీడీ యాక్ట్ కింద కేసులు అదుపులోకి తీసుకుని చర్లపల్లి జైలులో వేశారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసును ఈడీకి రిఫర్ చేశారు.

click me!