డిసెంబర్ 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశం .. అదే రోజు స్పీకర్ ఎన్నిక

Siva Kodati |  
Published : Dec 07, 2023, 09:53 PM IST
డిసెంబర్ 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశం .. అదే రోజు స్పీకర్ ఎన్నిక

సారాంశం

ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ  సమావేశం జరగనుంది . ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున ప్రోటెం స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. స్పీకర్ ఎన్నిక వుంటుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియాకు తెలిపారు. 

ఈ నెల 9న తెలంగాణ అసెంబ్లీ  సమావేశం జరగనుంది . ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే రోజున ప్రోటెం స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. స్పీకర్ ఎన్నిక వుంటుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మీడియాకు తెలిపారు. మార్పు కోరుకునే వారికి రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. 6 గ్యారంటీల అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలను కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించామని, రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో సీఎం చర్చిస్తారని శ్రీధర్ బాబు చెప్పారు. 

2014 నుంచి డిసెంబర్ 7, 2023 వరకు రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై అన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించామని దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. రేపు విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష చేస్తారని.. రైతులకు 24 గంటల కరెంట్‌తో పాటు గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలుపై చర్చిస్తామని మంత్రి వెల్లడించారు. 

ALso Read: డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆధార్ చూపిస్తే చాలు , రేవంత్ సర్కార్ తొలి నిర్ణయం

ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు గ్యారంటీని ఎల్లుండి నుంచి అమలు చేస్తామని శ్రీధర్ బాబు తెలిపారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని .. మంత్రులు, అధికారులు పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారని శ్రీధర్ బాబు వెల్లడించారు. 4 గంటల కరెంట్ ఇవ్వడం మా గ్యారంటీ అని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ కార్డ్ చూపించి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చునని మంత్రి తెలిపారు. కేబినెట్ సమావేశంలో గ్రూప్ 1, గ్రూప్ 2పై చర్చించామని  దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Holidays : ఇంకో రెండ్రోజులే స్కూళ్లు నడిచేది.. వరుసగా నాల్రోజులు సెలవులే
Telangana Budget Sessions: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. Governor Telugu Speech | Asianet News Telugu